Share News

Special trains: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:27 PM

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. వాటి వివరాలు.. - నెం.07193 సికింద్రాబాద్‌-కొల్లాం(Secunderabad-Kollam) ప్రత్యేక రైలు ఈనెల 17,24, మే 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26(గురువారం)తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

Special trains: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...

చెన్నై: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. వాటి వివరాలు..

- నెం.07193 సికింద్రాబాద్‌-కొల్లాం(Secunderabad-Kollam) ప్రత్యేక రైలు ఈనెల 17,24, మే 1,8,15,22,29, జూన్‌ 5,12,19,26(గురువారం)తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. మరు మార్గంలో నెం.07194 కొల్లాం-సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు ఈనెల19,26, మే 3,10,17, 124,31, జూన్‌ 7,14,21,28 (శుక్రవారం)తేదీల్లోకొల్లాంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 9.40గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

- నెం.06081 కొచ్చువెల్లి-షాలిమార్‌ ప్రత్యేక రైలు ఈ నెల 12,19,26, మే 3,10,17,24,31 (శుక్రవారం) తేదీల్లో కొచ్చువెల్లిలో సాయంత్రం 4.20 గంటలకు బయల్దేరి మూడవ రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు షాలిమార్‌ చేరుకుంటుంది. మరు మార్గంలో నెం.06082 షాలిమార్‌-కొచ్చువెల్లి ప్రత్యేక రైలు ఈ నెల 15,22,29 మే 6,13,20,27, జూన్‌3(సోమవారం) తేదీల్లో షాలిమార్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరి మూడవ రోజు ఉదయం 9.55 గంటలకు కొచ్చువెల్లి చేరుకుంటుంది.

- 06097 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-బార్మర్‌ (రాజస్తాన్‌) ప్రత్యేక రైలు ఈ నెల 14,21 (ఆదివారం) తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మూడవ రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు బార్మర్‌ చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06098 బార్మర్‌-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు ఈ నెల 17 (గురువారం), 26 (శుక్రవారం) తేదీల్లో బార్మర్‌లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మూడవ రోజు సాయంత్రం 5 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభమైందని దక్షిణ రైల్వే తెలియజేసింది.

ఇదికూడా చదవండి: Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

Updated Date - Apr 12 , 2024 | 12:27 PM