Share News

Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:45 AM

గడిచిన దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యమని ఇటీవల అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami) విమర్శించారు. నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లోకేశ్‌ తమిళ్‌ సెల్వన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు.

Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

- రాష్ట్రానికి బీజేపీ చేసింది శూన్యం..

చెన్నై: గడిచిన దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యమని ఇటీవల అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి గౌతమి(Film actress Gautami) విమర్శించారు. నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లోకేశ్‌ తమిళ్‌ సెల్వన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. అలాంటి భారతీ జనతా పార్టీ రాష్ట్రానికి అక్కర్లేదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని చిత్తుగా ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. గత మూడున్నరేళ్ళుగా కేంద్ర మంత్రిగా ఉన్న ఎల్‌.మురుగన్‌ ఇపుడు నీలగిరి స్థానం నుంచి బరిలో దిగుతున్నారన్నారు. ఈయన ఈ మూడున్నరేళ్ళ కాలంలో నీలగిరి జిల్లా వాసులకు ఒక్క మంచి పని అయినా చేశారా అని సినీ నటి గౌతమి ప్రశ్నించారు. చేతిలో అధికారం, అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ నీలగిరి ప్రజలకు ఆయన ఏం చేయలేదని ఆమె విమర్శలు గుప్పించారు.

ఇదికూడా చదవండి: Kamal Haasan: మంచివాళ్ల కోసమే నేను ప్రచారం చేస్తున్నా!

Updated Date - Apr 12 , 2024 | 12:11 PM