Share News

Ooty: మినీ కశ్మీర్ లా మారిపోయిన ఊటీ.. మంచందాల అద్భుత దృశ్యాలు మీ కోసం..

ABN , Publish Date - Feb 01 , 2024 | 07:48 AM

విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఊటీ ( ఉదకమండలం ) వణికిపోతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 1.3 డిగ్రీ సెల్సియస్‌కి పడిపోవడంతో మినీ కశ్మీర్ గా మారిపోయింది. దట్టంగా మంచు కురుస్తుండటంతో పాలసంద్రాన్ని తలపిస్తోంది.

Ooty: మినీ కశ్మీర్ లా మారిపోయిన ఊటీ.. మంచందాల అద్భుత దృశ్యాలు మీ కోసం..

విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఊటీ ( ఉదకమండలం ) వణికిపోతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 1.3 డిగ్రీ సెల్సియస్‌కి పడిపోవడంతో మినీ కశ్మీర్ గా మారిపోయింది. దట్టంగా మంచు కురుస్తుండటంతో పాలసంద్రాన్ని తలపిస్తోంది. కొండలు, లోయలు, చెట్లు, ఇళ్లు, వాహనాలపై మంచు పేరుకుంటోంది. పచ్చిక బయళ్లపై నీటి బిందువులు గడ్డకట్టాయి. పచ్చందాలు కాస్తా ధవళ వర్ణాన్ని సంతరించుకుని మురిసిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వెచ్చగా ఉండేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు.

ఊటీలో ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచు కురుస్తుంది. కానీ ఈ సంవత్సరం తుపాన్లు మంచు రాకను ఆలస్యం చేశాయి. ఊటీతో పాటు పరిసర ప్రాంతాలైన కాంతల్, పింకర్ పోస్ట్, తలై కుంట మంచుతో నిండిపోయాయి. ఈ పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు అందాలు ఆస్వాదించేందుకు కశ్మీరే వెళ్లాలా ఏంటీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Feb 01 , 2024 | 08:08 AM