Robbery: ఉద్యోగులను కట్టేసి.. తుపాకీతో బెదిరించి రూ. 1.91 కోట్లు దోపిడీ..
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:58 AM
ముంబయి మహాలక్ష్మి ప్రాంతంలో సాత్ రాస్తాలోని రిషబ్ జ్యువెలర్స్ అనే నగల దుకాణంలో రెండు దుండగులు తుపాకీ, కత్తులతో బెదిరించి దోపిడి చేశారు. ఈ దోపిడిలో ఆభరణాల విలువ రూ. 1.91 కోట్లు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ముంబయి(Mumbai)లో నిన్న ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మహాలక్ష్మి ప్రాంతంలోని సాత్ రాస్తాలోని రిషబ్ జ్యువెలర్స్ అనే నగల దుకాణంలోకి ఇద్దరు దుండగులు వెళ్లి తుపాకీ, కత్తులతో బెదిరించి దోపిడి చేశారు. ఈ దోపిడిలో మిస్సయిన మొత్తం ఆభరణాల విలువ రూ.1.91 కోట్లు. ఇది ముంబయి పోలీసులకు సైతం షాక్ ఇచ్చింది. పోలీసు అధికారి తెలిపినట్లుగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతములో ఈ దోపిడీ జరిగింది. దోపిడిదారులు కస్టమర్లుగా ప్రవేశించి, దుకాణ యజమాని భవర్‌లాల్ ధరంచంద్ జైన్, ఉద్యోగి పురాణ్ కుమార్‌ను బెదిరించి తాళ్లతో కట్టేశారు.
ఏం లూటీ చేశారంటే..
వారు ఆయుధాలతో వచ్చినందున అక్కడ పనిచేస్తున్న వారు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సాహసించలేకపోయారు. దోచుకున్న వస్తువుల్లో 2,458 గ్రాముల బంగారపు ఆభరణాలు, 2,200 గ్రాముల వెండీ ఆభరణాలు, రూ.15 వేల నగదు, ఒక వైఫై రూటర్ ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చెక్ చేస్తున్నారు. ఆ క్రమంలో నిందితులు యజమాని, ఉద్యోగులను కట్టేసి దోపిడీ చేశారు. ఆ క్రమంలో వారి ఉంగరాలు, గొలుసులు వంటివి వెంటనే దోచుకోవడంతో పాటు, ఆయుధాలను చూపించి లూటీ చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
తక్షణమే సమాచారం అందుకున్న అగ్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారుల వివరాల ప్రకారం ఈ ఘటన జరిగి కొంత వ్యవధి తర్వాత, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అగ్రిపాడు పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది. ఈ దోపిడీ ఘటనపై ముంబయి పోలీసు అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు 5 నుంచి 6 బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో నిందితులను త్వరగా పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నగరంలోని ప్రజలు, వ్యాపారుల భద్రతపై భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో కొత్త వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. దోపిడిలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలన్నారు. దీంతోపాటు భద్రత వ్యవస్థలను కూడా మరింత బలపరుస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Read More National News and Latest Telugu News