Share News

Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

ABN , Publish Date - Jan 08 , 2024 | 02:04 PM

అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది.

 Ayodhya: రామమందిర ప్రాణప్రతిష్ట  ఆహ్వానం వీరికే.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!

అయోధ్య: అయోధ్య (Ayodhya) రామజన్మభూమిలో మరో రెండు వారాల్లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే గాక విదేశాల్లో ఉన్న ప్రముఖులకు శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. ఒక్కొక్కరికి స్వయంగా ఇన్విటేషన్ కార్డు అందజేస్తోంది. తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌తోపాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ ప్రతినిధులు కూడా ఆహ్వాన ప్రక్రియలో పాల్గొంటున్నారు.

ఆహ్వానం అందింది వీరికే..

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి (Sonia Gandhi) ఆహ్వాన పత్రిక అందజేశారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli), బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (amitabh bachchan, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), గౌతమ్ అదానీలకు (Gautham Adani) ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు. ప్రతీ ఒక్కరికి తమ ప్రతినిధులు పత్రిక ఇస్తున్నారని.. పోస్టల్, కొరియర్ ద్వారా పంపడం లేదని ట్రస్ట్ సభ్యులు స్పష్టంచేశారు. కళా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆహ్వాన పత్రిక అందజేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న 50 మంది అతిథులను కూడా ఇన్వైట్ చేశామని చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న తమ ప్రతినిధులకు కార్డ్స్ పంపించామని.. వారు అక్కడ గెస్టులను కలిసి ఆహ్వానించారని ఒక ప్రకటనలో తెలిపారు.

ఆ నటులకు కూడా

ఇక్బాల్ అన్సారీకి ఇదివరకే పత్రికను అందజేశారు. రామాయణం టీవీ సీరియల్‌లో రాముడు (Lord Ram), సీతాదేవిగా (Seeta Devi) నటించిన నటినటులు అరుణ్ గోవిల్, దీపిక చీకిలాకు కూడా ఆహ్వాక పత్రిక అందజేశారు. రామాలయ నిర్మాణం కోసం బాబ్రీ మసీదు కూల్చివేసే క్రమంలో చనిపోయిన 50 మంది కర సేవకుల కుటుంబాలను ఆహ్వానించారు. దేశంలో ఉన్న కొందరు న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలకు ఇన్వైట్ చేశామని పేర్కొన్నారు.

ఆ కార్డులో ఏముంది అంటే..?

హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన ఆహ్వాన పత్రిక బుక్ లెట్ మాదిరిగా ఉంది. తెరవగానే రామ మందిరం, రాముడి ఫొటో ఉంది. మిగతా ప్రతుల్లో రామాలయ నిర్మాణం కోసం పాటుపడ్డ వారి జీవిత చరిత్ర రాసి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 02:04 PM