Share News

Rajkot Game Zone Fire: మానవ తప్పిదమే.. రాజ్‌కోట్ ఘటనపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - May 26 , 2024 | 03:03 PM

గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire) లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా మృతుల సంఖ్య 33కి చేరింది. ఈ విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది.

Rajkot Game Zone Fire: మానవ తప్పిదమే.. రాజ్‌కోట్ ఘటనపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ/ గాంధీనగర్: గుజరాత్‌లోని రాజ్ కోట్ గేమింగ్ జోన్(Rajkot trp Game Zone Fire) లో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది పిల్లలతో సహా మృతుల సంఖ్య 33కి చేరింది. ఈ విషాద ఘటనపై గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) స్పెషల్ బెంచ్ ఆదివారం ప్రత్యేకంగా విచారించింది. రాజ్‌కోట్ ఘటన మానవ తప్పిదమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా తీసుకుని విచారిస్తోంది.


ఎందుకిలా..?

జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవన్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "అధికారుల నుంచి అనుమతులు లేకుండానే ఇలాంటి గేమింగ్ జోన్లు, వినోద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్‌ల న్యాయవాదులు సోమవారం మా ఎదుట హాజరు కావాలి. నిబంధనలు గాలికొదిలి వీటి ఏర్పాటుకు అనుమతించిన అధికారుల వివరాలను సమర్పించాలిఅని న్యాయస్థానం కోరింది. గుజరాత్ సమగ్ర సాధారణ అభివృద్ధి నియంత్రణ నిబంధనల(GDCR)లోని లొసుగులను రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్ ఉపయోగించుకుందని మీడియాలో వచ్చిన కథనాలను చూసి ఆశ్చర్యపోయినట్లు కోర్టు తెలిపింది.

ప్రజా భద్రతకు ముప్పు!

" ఈ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు అవసరం లేకుండా వచ్చాయని అర్థం అవుతోంది. అగ్నిమాపక ఎన్‌ఓసీ, నిర్మాణ అనుమతులు సహా అవసరమైన అనుమతులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఏర్పడిన అడ్డంకులను అధిగమించడానికి రాజ్‌కోట్‌లోని టీఆర్పీ గేమ్ జోన్‌లో తాత్కాలిక నిర్మాణాలు సృష్టించారు. రాజ్‌కోట్ మాత్రమే కాదు, అహ్మదాబాద్‌లో కూడా ఇటువంటి గేమ్ జోన్‌లు వచ్చాయి. అవి ప్రజా భద్రతకు ముప్పుగా మారాయి" అని హైకోర్టు పేర్కొంది.

Fire Accident: గేమ్‌జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి


Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 04:00 PM