Share News

Narendra Modi: ప్రధాని మోదీ బస చేసిన హోటల్ బిల్ పెండింగ్.. ఏడాదిగా చెల్లించలేదన్న నిర్వహకులు

ABN , Publish Date - May 26 , 2024 | 04:27 PM

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) బస చేసిన హోటల్ బిల్లు ఏడాది కాలంగా చెల్లించలేదని హోటల్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కర్ణాటక అటవీ శాఖకు లెటర్ రాసింది. అయితే ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Narendra  Modi: ప్రధాని మోదీ బస చేసిన హోటల్ బిల్ పెండింగ్.. ఏడాదిగా చెల్లించలేదన్న నిర్వహకులు
rs 80 lakh bill pending where Prime Minister Narendra Modi

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) బస చేసిన హోటల్ బిల్లు ఏడాది కాలంగా చెల్లించలేదని హోటల్ యాజమాన్యం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కర్ణాటక అటవీ శాఖకు లెటర్ రాసింది. అయితే ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 2023 ఏప్రిల్‌లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF) నిర్వహించిన 50 సంవత్సరాల ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మైసూర్(Mysuru) వచ్చారు. ఆ సమయంలో ప్రధాని రాడిసన్ బ్లూ ప్లాజా(Radisson Blu Plaza) హోటల్లో బస చేశారు.


అందుకు సంబంధించిన ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులు చూసుకున్నారు. కానీ ఆ బిల్లు మొత్తం వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.80 లక్షలు అయ్యిందని, దానిని చెల్లించాలని హోటల్(Radisson Blu Plaza) యాజమాన్యం లేఖలో కోరింది. జూన్ 1, 2024లోగా బకాయి ఉన్న బిల్లును చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం హెచ్చరించింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ స్పందించారు. ఆ బిల్లును వెంటనే చెల్లిస్తామని హోటల్ యాజమాన్యానికి చెప్పారు.


ఈ కార్యక్రమాన్ని NTCA, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. అందుకోసం మొత్తం ఖర్చు 6.33 కోట్లు కాగా, కేంద్రం రూ.3 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం రూ. 3.33 కోట్లు ఇంకా విడుదల కాలేదు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం NTCAతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బిల్లులు చెల్లింపు చేస్తే రీయింబర్స్ చేస్తామంటూ NTCA సమాధానం తెలిపింది.


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest News and National News here

Updated Date - May 26 , 2024 | 04:38 PM