Share News

PM Modi: అందరి మాటల్లో రాముడు - అందరి హృదయాల్లో రాముడు.. మన్ కీ బాత్ లో ప్రధాని..

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:50 PM

భారత రాజ్యాంగలోని పార్ట్-3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామలక్ష్ణణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా

PM Modi: అందరి మాటల్లో రాముడు - అందరి హృదయాల్లో రాముడు.. మన్ కీ బాత్ లో ప్రధాని..

భారత రాజ్యాంగలోని పార్ట్-3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామలక్ష్ణణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా అమృతోత్సవ కాలంలో మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు సైతం కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు.

అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని కోట్లాది మంది ప్రజలు వసుధైక కుటుంబం అనే భావనను చాటారని కొనియాడారు. అందరి మాటల్లో రాముడు - అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడని ప్రధాని వ్యాఖ్యానించారు. జనవరి 22న దేశం మొత్తం రామజ్యోతి వెలిగించి, దీపావళిని జరుపుకుందని అన్నారు. రాముడి పాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చిందన్న ప్రధాని..అందుకే జనవరి 22న అయోధ్యలో లార్డ్ టు ది నేషన్-రామ్ టు ది నేషన్ పై మాట్లాడినట్లు పేర్కొన్నారు.


"రిపబ్లిక్ డే పరేడ్ అద్భుతంగా ఉంది. మొత్తం 20 కవాతు కాంటెంజెంట్స్‌లో 11 మంది మహిళా కంటెంజెంట్లు, టేబుల్‌లాక్స్‌లో అందరు కళాకారులు కూడా మహిళలే ఉన్నారు. 1500 మంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. శంఖం, నాదస్వరం వంటి భారతీయ సంగీత వాయిద్యాలనూ వాయించారు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వారు మరింత ప్రగతి సాధిస్తున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్లలో మహిళా అథ్లెట్లు పాల్గొని దేశానికి అవార్డులు సాధించారు. ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లకు అర్జున అవార్డుతో సత్కరించాం."

- నరేంద్ర మోదీ, ప్రధాని

అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన అనేక మందికి పద్మ అవార్డులు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పద్మ అవార్డులు ప్రజల అవార్డులుగా మారాయన్న ప్రధాని.. ఈ అవార్డుల ప్రదాన విధానంలో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఆయుర్వేదం, సిద్ధ, యూనాని పద్ధతుల ద్వారా దేశవిదేశాలకూ చికిత్స అందించే స్థాయికి ఎదిగామని ప్రశంసించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 28 , 2024 | 12:51 PM