Share News

PM Modi: కాంగ్రె్‌సకు 50 సీట్లు కూడా రావు..

ABN , Publish Date - May 12 , 2024 | 02:17 AM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కనీసం 50 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒడిసాలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో మాట్లాడారు.

PM Modi: కాంగ్రె్‌సకు 50 సీట్లు కూడా రావు..

ఒడిసాలో ప్రచార సభల్లో ప్రధాని మోదీ

భువనేశ్వర్‌, మే 11: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు కనీసం 50 సీట్లు కూడా రావని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి ఎన్డీఏ అన్ని రికార్డులను బద్దలుకొట్టి 400 సీట్లకు పైగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒడిసాలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో మాట్లాడారు. ‘యువరాజు’ 2014 నుంచి ఒకే స్ర్కిప్ట్‌ చదువుతున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని పరోక్షంగా విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న రాహుల్‌ విమర్శలు ఆయన కపటత్వానికి నిదర్శనమని మోదీ మండిపడ్డారు.


ఇప్పుడు రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్న ‘యువరాజు’.. నాడు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ పత్రాలను చింపివేసి రాజ్యాంగాన్ని అవమానించారని 2013 నాటి ఘటనను గుర్తు చేశారు. పాకిస్థాన్‌ దగ్గరా అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని గౌరవించి చర్చలు ప్రారంభించాలన్న కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఆ అణుబాంబులను ఎలా ఉంచాలో తెలియని స్థితిలో పాకిస్థాన్‌ ఉందని, వాటిని అమ్మేయాలని చూస్తోందన్నారు. కానీ వాటి నాణ్యత గురించి తెలిసి ఎవరూ కొనడం లేదని వ్యాఖ్యానించారు. 26 ఏళ్ల క్రితం ఇదే రోజు కేంద్రంలో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోఖ్రాన్‌ అణు పరీక్ష నిర్వహించి, భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఒడిసాలోని బీజేడీ ప్రభుత్వంపైనా మోదీ విమర్శలు సంధించారు. భువనేశ్వర్‌లో జూన్‌ 10న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేస్తారన్నారు.

Updated Date - May 12 , 2024 | 02:17 AM