Share News

Lok Sabha Elections: 'ముజ్రా' డాన్స్ ఇక్కడే జరిగిందా?.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే

ABN , Publish Date - May 26 , 2024 | 04:55 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్ష నేతలను ఉద్దేశించిన చేసిన 'ముజ్రా' డాన్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ ప్రజలను మోదీ అవమానిస్తున్నారని అన్నారు.

Lok Sabha Elections: 'ముజ్రా' డాన్స్ ఇక్కడే జరిగిందా?.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే

సాసారామ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విపక్ష నేతలను ఉద్దేశించిన చేసిన 'ముజ్రా' (Mujra) డాన్స్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ ప్రజలను మోదీ అవమానిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేత, మహాఘట్‌బంధన్ అభ్యర్థి మనోజ్ కుమార్ తరఫున బీహార్‌లోని సాసారామ్ (Sassaram) లోక్‌సభ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే మాట్లాడుతూ, ముజ్రా డాన్స్ ఇక్కడే జరిగినట్టు ప్రధాని మాట్లాడటం బీహార్ ప్రజలను మోదీ అవమానించడమేనని అన్నారు. శుక్రవారంనాడు బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ''ముజ్రా'' వ్యాఖ్యలు చేశారు.


ఆయన మాస్టర్ కాదు, డిక్టేటర్..

ప్రధానమంత్రి తనను తాను ఒక మాస్టర్ (తీస్మార్‌ఖాన్) అనుకుంటున్నారని, చాలా తప్పుడు అభిప్రాయంలో ఆయన ఉన్నారని, ప్రజలే మాస్టర్లని, ఆయన ఒక నియంత అని ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ప్రజల గొంతు అణిచివేస్తారని హెచ్చరించారు.

PM Modi : ముస్లిం ఓట్ల కోసం ‘ఇండియా’ ముజ్రా డ్యాన్స్‌


పీపుల్ Vs మోదీ

ఈ ఎన్నికలు ప్రజలకు, మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, రాహుల్‌కు మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఎంతమాత్రం కావని ఖర్గే తెలిపారు. ప్రధాని సంపన్నులను అక్కున చేర్చుకుంటారే కానీ పేద ప్రజలను కాదని అన్నారు. బీహార్‌లోని సాసారామ్, నలందా, పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, కరకాట్, జెహ్నాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల్లో జూన్ 1వ తేదీన ఏడవ విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగనుంది.

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 04:55 PM