Share News

LPG Cylinders: న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:58 AM

నూతన సంవత్సరం రోజున గ్యాస్ సిలిండర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.

LPG Cylinders: న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు

నూతన సంవత్సరం రోజున గ్యాస్ సిలిండర్ల ధరలు స్వల్పంగా తగ్గాయి. తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే ఈ తగ్గుదల అన్ని రకాల ఎల్పీజీ సిలిండర్లపై కాదు. 19 కేజీల కమిర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ ఫ్యూయల్) పై మాత్రమే. గ‌ృహాల్లో వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1755.50గా ఉంది. గతంలో ఈ ధర రూ. 1757గా ఉండేది. ముంబైలో గతంలో రూ.1710కి లభించే ఈ సిలిండర్ ఇక నుంచి రూ.1708.50కి అందుబాటులో ఉండనుంది.


చైన్నైలో రూ.1929 నుంచి రూ.1924.50కు తగ్గగా.. కోల్‌కతాలో రూ.1869కి లభిస్తోంది. ఇక విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) ధర ఢిల్లీలో రూ.1,01,993.17/Klకి తగ్గింది. ఇది కోల్‌కతాలో రూ.1,10,962.83/Kl, ముంబైలో రూ.95,372.43/Kl, చెన్నైలో రూ.1,06,042.99/Klకి తగ్గింది. కాగా 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. వీటి ధరలను చివరిగా ఆగస్టు 30, 2023న మార్చారు. దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902, చెన్నైలో రూ.918గా ఉంది.

Updated Date - Jan 01 , 2024 | 12:23 PM