Share News

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

ABN , Publish Date - Mar 10 , 2024 | 11:08 AM

వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Premalatha: రాజ్యసభ సీటు కోసం ‘ప్రేమలత’ పట్టు.. కొలిక్కిరాని చర్చలు

చెన్నై: వచ్చే యేడాది రాష్ట్రంలో ఖాళీ పడనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక సీటు కేటాయించాలని డీఎండీకే నాయకురాలు ప్రేమలత పట్టుబడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాట్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది. అన్నాడీఎంకే(AIADMK) కూటమిలో డీఎండీకే చేరినా రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు సాఫీగా జరగలేదు. తొలుత ఈ నెల 1న అన్నాడీఎంకే నేతలు విరుగంబాక్కంలోని ప్రేమలత ఇంటికి వెళ్లి ఆమెతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైలో డీఎండీకే సభ్యులు రెండో విడత చర్చలు జరిపారు. ఆ సందర్భంగా డీఎండీకే నేతలు విలేకరులతో మాట్లాడుతూ... గెలుపు కూటమిలో చేరటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఆ తర్వాత మూడో విడత చర్చలు జరిపి డీఎండీకేకి సీట్ల కేటాయింపులు ఖరారవుతాయని రెండు పార్టీల నేతలు ఎదురుచూశారు. శుక్రవారం నగరంలో విల్కేరుల సమావేశంలో ప్రేమలత మాట్లాడుతూ కూటమిపై తమ పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటూ ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే నేతలంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. రెండు విడతలుగా చర్చలు జరిపిన తర్వాత కూడా కూటమిపై నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడం వెనుక తిరకాసు ఏమిటో తెలియక అన్నాడీఎంకే నేతలు సతమతమయ్యారు.

Updated Date - Mar 10 , 2024 | 11:08 AM