Share News

PM Narendra Modi: రాజకీయాల్లో కొందరిని పదే పదే లాంచ్ చేయాలి.. రాహుల్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:34 PM

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక వెంచర్ పని చేయకపోతే ఇతర మార్గాల్లోకి వెళ్లే స్టార్టప్‌ల మాదిరిగా కాకుండా.. రాజకీయాల్లో కొందరిని రిపీటెడ్‌గా లాంచ్ చేయాల్సిన అవసరం ఉంటుందని రాహుల్‌ని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. స్టార్టప్ మహాకుంభ్‌లో (Startup Mahakumbh) ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్‌లను చాలామంది ప్రారంభిస్తారని, రాజకీయాల్లో ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు.

PM Narendra Modi: రాజకీయాల్లో కొందరిని పదే పదే లాంచ్ చేయాలి.. రాహుల్‌పై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi) విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక వెంచర్ పని చేయకపోతే ఇతర మార్గాల్లోకి వెళ్లే స్టార్టప్‌ల మాదిరిగా కాకుండా.. రాజకీయాల్లో కొందరిని రిపీటెడ్‌గా లాంచ్ చేయాల్సిన అవసరం ఉంటుందని రాహుల్‌ని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. స్టార్టప్ మహాకుంభ్‌లో (Startup Mahakumbh) ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్‌లను చాలామంది ప్రారంభిస్తారని, రాజకీయాల్లో ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు. కొందరినైతే పదేపదే లాంచ్ చేయక తప్పదంటూ.. రాహుల్ పేరు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు.


తాము మూడోసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పిస్తామని స్పష్టం చేశారు. 2014లో మన దేశంలో 100 కంటే తక్కువ స్టార్టప్‌లు ఉండేవని.. కానీ ఇప్పుడు 1.25 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్‌లు ఉన్నాయని, 12 లక్షల మంది యువత నేరుగా వాటితో అనుబంధం కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందని, మన వద్ద 100కు పైగా యునికార్న్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియన్ స్టార్టప్స్ 12వేల కంటే ఎక్కువ పేటెంట్లను దాఖలు చేశాయని.. అయితే పేటెంట్ల ప్రాముఖ్యతను గ్రహించని వారు ఇంకా చాలామంది ఉన్నారని తెలిపారు. ప్రపంచం వేగంగా దూసుకుపోతున్న తరుణంలో.. పేటెంట్‌ల కోసం దాఖలు చేయాలని పారిశ్రామికవేత్తలను, ఆవిష్కర్తలను సూచించారు.

ఒకప్పుడు చదువుకుంటే ఉద్యోగం వచ్చేదని, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే స్థిరపడొచ్చని అనుకునేవారని.. కానీ ఇప్పుడు ఆ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇంతకుముందు ఆవిష్కర్తలు నిధుల గురించి ఆందోళన చెందేవారని, ఫైనాన్సింగ్ ఉన్నవారు మాత్రమే వ్యాపారం చేయగలరని నమ్మేవారని, కానీ స్టార్టప్ సంస్కృతి ఆ ఆలోచనా విధానాన్ని విచ్ఛిన్నం చేసిందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశ యువత తమ సత్తా నిరూపిస్తోందని అన్నారు. నేడు ఇండియన్ స్టార్టప్స్ ‘స్పేస్’ వంటి ఫ్రాంటియర్స్‌లోనూ తమ పనితనం చాటుతున్నాయని, ఇప్పటికే కొన్ని స్టార్టప్స్ స్పేస్ షటిల్‌లను ప్రారంభించాయని మోదీ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 20 , 2024 | 04:34 PM