Share News

PM Modi: 76 రోజులు.. 206 సభలు.. 80 ఇంటర్వ్యూలు.. మోదీ సరికొత్త రికార్డ్

ABN , Publish Date - May 31 , 2024 | 07:33 AM

లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్లే తీవ్రంగా శ్రమించింది.

PM Modi: 76 రోజులు.. 206 సభలు.. 80 ఇంటర్వ్యూలు.. మోదీ సరికొత్త రికార్డ్

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్లే తీవ్రంగా శ్రమించింది. ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు బీజేపీలో నయా జోష్ నింపాయి. 2019 ఎన్నికలతో పోల్చితే మోదీ ఈ సారి ప్రచారంలో చాలా వేగం చూపారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన సభతో మోదీ(PM Modi) ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.


ప్రచారం ముగిసిన వెంటనే ఆయన తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద జూన్ 1 వరకు ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై దాదాపు రెండు రోజులు (45 గంటలు) ధ్యానం చేయనున్నారు.ఆయన 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 200కిపైగా సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు.

2019లో 68 రోజుల ప్రచారంలో 145 సభల్లో పాల్గొనగా ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిననాటి నుంచి గురువారం వరకు 76 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. మీడియాకు 80 ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం. 400కుపైగా సీట్లలో విజయం సాధించి 2024లో మళ్లీ మూడోసారి అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. మార్చి 15, 17 మూడు రోజుల వ్యవధిలోనే ఐదు రాష్ట్రాలను కవర్ చేశారు.


దక్షిణాదిపై బీజేపీ ఫోకస్

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి బీజేపీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2019లో ఈ మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీకి సరైన ఫలితం దక్కలేదు. ఈసారి మూడు రాష్ట్రాల్లో సత్తాచాటి.. కర్ణాటకలో బలాన్ని కొనసాగించి తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

73 ఏళ్ల వయసులోనూ మోదీ వరుస పర్యటనలు, పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలనే ఆయన తపన చూసి రాజకీయ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అటు ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహిస్తూనే, 80 మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం సాధారణ విషయం కాదని అంటున్నారు. మోదీ పడ్డ కష్టం ఏ మేరకు ఫలిస్తుందోననేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 07:33 AM