Share News

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - May 25 , 2024 | 10:30 AM

లోక్ సభ ఆరో దశ ఎన్నికలు(Lok Sabha election 2024) జరుగుతున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

PM Modi: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.. ఆరో దశ ఎన్నికల వేళ మోదీ ఆసక్తికర పోస్ట్

ఢిల్లీ: లోక్ సభ ఆరో దశ ఎన్నికలు(Lok Sabha election 2024) జరుగుతున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. "ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే.

ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా" అని మోదీ అన్నారు.


బుజ్జగింపులు, అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయాలి..

బుజ్జగింపులు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 11 కోట్ల మంది ఓటర్లు 889 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

For Latest news and National News click here..

Updated Date - May 25 , 2024 | 10:30 AM