Share News

Congress: కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:52 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.

Congress: కాంగ్రెస్‌కు ఐటీ విభాగం షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం (Income Tax Department) శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది. తమపై ఐటీ విభాగం పన్ను మదింపు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారంనాడు కొట్టివేసిన వెంటనే తాజా పరిణామం చోటుచేసుకుంది.


కాంగ్రెస్ ఆగ్రహం..

రూ.1,823.08 కోట్ల పన్ను నోటీసు అందుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ధ్రువీకరించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆర్థికంగా నడ్డివిరిచేందుకు 'టాక్స్ టెర్రరిజానికి' బీజేపీ పాల్పడుతోందని తప్పుపట్టింది. ఆదాయం పన్ను చట్టాల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆక్షేపణ చేశారు. 'ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్' ద్వారా బీజేపీ రూ.8,200 కోట్లు వసూలు చేసిందని, ఇందుకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిండ్, పోస్ట్-రైడ్ బ్రైబ్స్, షెల్ కంపెనీల మార్గం తొక్కిందని జైరామ్ రమేష్ ఆరోపించారు. మరోవైపు టాక్స్ టెర్రరిజానికి బీజేపీ పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే తాము మాత్రం బెదిరేది లేదని చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని, పార్టీ హామీలను ప్రజల ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. ఆదాయం పన్ను విభాగం నోటీసులకు భయపడేది లేదని, మరింత పట్టుదలగా ఎన్నికల్లో పోరాటం సాగిస్తామని చెప్పారు. కాంగ్రెస్, భావసారూప్యత కలిగిన పార్టీలను మాత్రమే ఐటీ విభాగం టార్గెట్ చేసుకుందని, బీజేపీ ''అనుబంధ సంస్థ''గా మారిందని అజయ్ మాకెన్ ఆరోపించారు. దీనపై త్వరలోనే సుప్రీంకోర్టును తమ పార్టీ ఆశ్రయిస్తుందని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 03:52 PM