Share News

Lok Sabha Elections: భయపడను, మడం తిప్పేది లేదు: మోదీ

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:25 PM

విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.

Lok Sabha Elections: భయపడను, మడం తిప్పేది లేదు: మోదీ

పూర్ణియా: విపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.


ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీహార్‌లోని పూర్ణయాలో మంగళవారంనాడు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందని, ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకల పాలన సాగించిందని అన్నారు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను అనుమతిస్తున్నాయని ఆరోపించారు.


''సీమాంచల్ చాలా సున్నితమైన ప్రాంతం. ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వారు సీమాంజల్ పూర్ణియా ప్రాంతంలో అక్రమ చొరబాట్లకు అనుమతిస్తూ భద్రతతో రాజీపడుతున్నారు. దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల మా ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుందని మీకు భరోసా ఇవ్వదలచుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో నేను ఎవరికీ బెదరను, తలవంచేది కూడా లేదు'' అని మోదీ స్పష్టం చేశారు. సీమాంచల్, పూర్ణియా అబివృద్ధికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశంలోని 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, వారికోసం తమ ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని తెలిపారు. సీమాంచల్ ఏరియాలో వందే భారత్, నమో భారత్ రైళ్ల ద్వారా డపలప్‌మెంటీ కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక ట్రయిలర్ మాత్రమేనని, ఇప్పుడు సీమాచంల్, బీహార్, యావద్దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తామని భరోసా ఇచ్చారు.

ఒకే దేశం.. ఒకే నాయకుడు.. ప్రజలను అవమానించడమే!


కాగా, పూర్ణియాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఈ సీటులో గెలిచిన పప్పూ యాదవ్ ఇక్కడ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ తమ అభ్యర్థిగా సంతోష్ కుమార్‌ను బీజేపీ నిలబెట్టగా, బీమా భారతిని ఆర్జేడీ నిలబెట్టింది. 40 లోక్‌సభ స్థానాలున్న బీహార్‌లో మొత్తం 7 దశల్లోనూ పోలింగ్ జరుగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఎన్డీయే 39 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో గెలువగా, ఎల్‌జేపీ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 04:25 PM