Share News

Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:29 PM

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. తొలి విడత పోలింగ్‌ ప్రచారానికి బుధవారంనాడు తెరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఇద్దరు నేతలు మీడియా సంయుక్త సమావేశంలో పాల్గొ్న్నారు.

Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్

ఘజియాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA)కు 150 సీట్లకు మించి రావని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadva) జోస్యం చెప్పారు. తొలి విడత పోలింగ్‌ ప్రచారానికి బుధవారంనాడు తెరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 15-20 రోజుల క్రితం బీజేపీకి 180 సీట్ల వరకూ వస్తాయని అంచనా వేశానని, కానీ ఇప్పుడు 150 సీట్లు రావచ్చని అనుకుంటున్నానని చెప్పారు. ప్రతి రాష్ట్రం నుంచి రిపోర్టులు తెప్పించుకున్నామని, మేము (కాంగ్రెస్) బాగా మెరుగుపడ్డామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమి చాలా బలంగా ఉందని, మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.


ఇది బీజేపీ ప్రశ్న

లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కానీ రాయబరేలీ నుంచి కానీ పోటీ చేసే అవకాశంపై రాహుల్‌ను అడిగినప్పుడు ''ఇది బీజేపీ ప్రశ్న'' అని రాహుల్ చమత్కరించారు. ''మంచిది..నాకు ఎలాంటి ఆదేశం వస్తే ఆది ఫాలో అవుతాను. మా పార్టీలో అభ్యర్థుల ఎంపిక నిర్ణయం సీఈసీదే'' అని ఆయన సమాధానమిచ్చారు.


శ్రీరామనవమి శుభాకాంక్షలు

రాహుల్ అభిప్రాయంతో అఖిలేష్ యాదవ్ ఏకీభవించారు. ''తొలుత అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. ఇవాళ మేము ఘజియాబాద్‌లో ఉన్నారు. ఈసారు 'ఇండియా' కూటమి ఘజియాబాద్ నుంచి ఘాజీపూర్ వరకూ బీజేపీని తుడిచిపెట్టడం ఖాయం. బీజేపీ ఇచ్చిన నకలీ వాగ్దానాలపై రైతులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం ఆ పార్టీ నైజం బయటపెట్టింది'' అని అఖిలేష్ అన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 02:29 PM