Share News

NCP: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఖాతా తెరిచిన ఎన్సీపీ.. రికార్డ్..?

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:23 AM

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

NCP: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఖాతా తెరిచిన ఎన్సీపీ.. రికార్డ్..?
Ajit pawar NCP

ముంబై: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది. ఆ పార్టీ మూడు స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఎన్సీపీ గెలువడంతో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఏంటంటే..?

అజిత్ పవార్ ఎన్సీపీ మహారాష్ట్రలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మహారాష్ట్రతోపాటు ఆ పార్టీకి నాగాలాండ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. మరో రాష్ట్రంలో ఎన్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే చాలు ఆ పార్టీకి జాతీయ హోదా వస్తోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఒక పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఎన్సీపీ ముఖ్యనేత ప్రఫుల్ పటేల్ షేర్ చేశారు. తమ పార్టీ అడుగుదూరంలో ఉందని ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ 46 సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టనుంది. ఎన్పీఈపీ ఐదు, ఎన్సీపీ 3, పీపీఏ 2, కాంగ్రెస్ ఒక సీటును గెలుచుకుంది.

Updated Date - Jun 03 , 2024 | 10:23 AM