Share News

High Court: చీఫ్ జస్టిస్ ఎదుట గొంతు కోసుకున్న వ్యక్తి.. ఎందుకంటే..?

ABN , Publish Date - Apr 03 , 2024 | 07:46 PM

కర్ణాటక హైకోర్టులో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు హాల్ ఒకటిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు. మైసూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు హాల్ ఒకటి వద్దకు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఒక ఫైల్ అందజేశాడు. వెంటనే తనతో పాటు తీసుకొచ్చిన కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు.

High Court: చీఫ్ జస్టిస్ ఎదుట గొంతు కోసుకున్న వ్యక్తి.. ఎందుకంటే..?

బెంగళూర్: కర్ణాటక హైకోర్టులో (High Court) బుధవారం నాడు భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. కోర్టు హాల్ ఒకటిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నీలయ్ విపిన్ చంద్ర అంజారియా, న్యాయవాదులు, తదితరులు ఉన్నారు. మైసూర్‌కు (Mysure) చెందిన శ్రీనివాస్ (Srinivas) అనే వ్యక్తి కోర్టు హాల్ ఒకటి వద్దకు వచ్చాడు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఫైల్ అందజేశాడు. వెంటనే తనతోపాటు తీసుకొచ్చిన కత్తి తీసుకొని గొంతు కోసుకున్నాడు. హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని సమీపంలోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.

శ్రీనివాస్ ఎవరు..? ఎందుకు కోర్టు లోపలికి వచ్చాడు..? కోర్టు లోపల ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే అంశంపై స్పష్టత లేదు. హైకోర్టులో భద్రతా లోపంపై చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కత్తితో లోపలికి ఎలా రానిచ్చారు. ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు.

సెక్యూరిటీ సిబ్బందికి శ్రీనివాస్ ఇచ్చిన ఫైల్ ఏంటీ..? దానికి సంబంధించి కోర్టు న్యాయవాదిని నియమించలేదు. అందుకోసమే ఆ ఫైల్‌ను పరిశీలించడం లేదని హైకోర్టు రిజిస్ట్రార్ వివరించారు. కోర్టు ఆదేశాలు లేకుండా అధికారులు ఎలాంటి పత్రాలు స్వీకరించొద్దని స్పష్టం చేశారు. శ్రీనివాస్ సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేశాడనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. గాయపడ్డ శ్రీనివాస్ కోలుకున్న తర్వాత స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Arvind Kejriwal arrest: జంతర్‌మంతర్ వద్ద 7న 'ఆప్' నిరాహార దీక్ష

Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?

Updated Date - Apr 03 , 2024 | 07:51 PM