Share News

Bengaluru: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు

ABN , Publish Date - May 02 , 2024 | 03:11 PM

జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్‌ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.

Bengaluru: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు

బెంగళూరు: జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్‌ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి. కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర గురువారం మాట్లాడుతూ.. రేవణ్ణ ఈ కేసును విచారించే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు త్వరగా హాజరుకావాలని హాజరు కాకపోతే అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.

అంతకుముందు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి వారం రోజుల సమయం కావాలని ప్రజ్వల్ చేసిన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది.


మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు ముప్పై మూడేళ్ల రేవణ్ణ, తండ్రి హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించడంతో కన్నడ రాజకీయాల్లో దుమారం రేగింది. రేవణ్ణ ఇంట్లో వంట మనిషిగా పనిచేశానని పోలీసులకు చెప్పిన మహిళ, జేడీఎస్ ఎంపీ తన కూతురిని వీడియో కాల్స్ ద్వారా వేధించేవాడని ఆరోపించారు. ప్రజ్వల్ రేవణ్ణ వందల సంఖ్యలో మహిళలతో సెక్స్ చేస్తున్న వెయ్యికి పైగా వీడియోలు ఇటీవల నెట్టింట వైరల్ అయ్యాయి.

అతని వేధింపులకు గురైన వారిలో మైనర్ల నుంచి 50 ఏళ్ల వయసుగల వారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేవణ్ణ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల నడుమ జేడీఎస్ లో ఈ ఘటన పెను దుమారాన్నే రేపుతోంది. జేడీఎస్, బీజేపీ పొత్తులో ఉండటంతో.. ఈ ఘటనను తమకు అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు.

దక్షిణ కర్ణాటకలో గణనీయమైన ఆధిపత్యాన్ని కలిగి ఉన్న వొక్కలిగ సామాజిక వర్గంలో జేడీఎస్‌కి అత్యధిక ఓటు బ్యాంక్ ఉంది. వొక్కలిగ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్న పద్నాలుగు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 02 , 2024 | 03:11 PM