Home » Deve Gowda
కర్ణాటకతో సహా 10 రాష్ట్రాల నుంచి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేడీ(ఎస్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడను రెండోసారి రాజ్యసభకు పంపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వ్యవహారంలో ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది.
జనతాదళ్ సెక్యులర్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై(Prajwal Revanna) లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజకీయ దుమారం రేగడంతో ఆయనకు లుక్ అవుట్ నోటీసులు(Lookout Notice) జారీ అయ్యాయి.