Share News

Lok Sabha Polls 2024: అఖిలేష్ నియోజకవర్గం కన్ఫామ్.. నామినేషన్ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Apr 24 , 2024 | 09:31 PM

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Lok Sabha Polls 2024: అఖిలేష్ నియోజకవర్గం కన్ఫామ్.. నామినేషన్ ఎప్పుడంటే..?

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పోటీచేసే నియోజకవర్గం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ (Kannauj) నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మే 13న జరిగే లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గంలో పోలింగ్ ఉంటుంది.


కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌తో పాటు యాదవ్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు పోటీలో ఉన్నారు. మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్, అజాంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు.

Priyanka Gandhi: ఫలితాలు అనూకూలంగా రావనే నిస్పృహల్లో బీజేపీ


అఖిలేష్ యాదవ్ 2000లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకూ ఈ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యమంత్రి కావడంతో 2012లో ఈ నియోజకవర్గాన్ని అఖిలేష్ విడిచిపెట్టారు. దీంతో ఆయన భార్య డింపుల్ యాదవ్ ఇక్కడి నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచారు. 2014లో డింపుల్ తిరిగి కన్నౌజ్ సీటు గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత 2019లో ఆ సీటు బీజేపీ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్‌లో భాగంగా 63 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ పడుతోంది.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 09:31 PM