Share News

Priyanka Gandhi: ఫలితాలు అనూకూలంగా రావనే నిస్పృహల్లో బీజేపీ

ABN , Publish Date - Apr 24 , 2024 | 07:48 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు.

Priyanka Gandhi: ఫలితాలు అనూకూలంగా రావనే నిస్పృహల్లో బీజేపీ

వయనాడ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావనే నిరాశానిస్పృహలు బీజేపీలో కనిపిస్తున్నాయన్నారు. ఆ కారణంగానే ప్రజా సంక్షేమంతో ఏమాత్రం సంబంధంలేని రోజుకో అంశాన్ని ఆ పార్టీ నేతలు లేవనెత్తుతున్నారని ప్రియాంక తప్పుపట్టారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడం, తప్పుదారిపట్టించడం, వారిని భయపెట్టడం వంటి స్థాయికి బీజేపీ నేతలు దిగజారారని 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విమర్శించారు.


బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడం, విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిండం వంటి అంశాలపై దృష్టి సారించి ఉంటే ఈరోజు వేదకలపై ఇతర అంశాలు ప్రస్తావించాల్సిన అవసరమే వచ్చేది కాదని ప్రియాంక అన్నారు. ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికలు తమకు అనుకూలం లేవని బీజేపీ నేతలు గ్రహించినందునే కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం, దాడులు సాగిస్తున్నారని విమర్శించారు.


''ప్రధానితో సహా బీజేపీ అగ్రనేతల ప్రవర్తన చూసినప్పుడు ఎన్నికలు తమకు అనూకూలంగా లేవని వారు గ్రహించినట్టు కనిపిస్తోంది. వారంతో నిరాశానిస్పృహలతో కనిపిస్తున్నారు. అందుకే అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. 10 ఏళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఉంటే ఈరోజు వేదకలపై అసంబద్ధమైన ప్రస్తావనలు వచ్చేవి కావు. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అవేవీ ప్రజలకు ఉపయోగపడేవి కావు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, తప్పుదారి పట్టించి, భయపడ్డే స్థితికి దిగజారేవారు కాదు. ఎన్నికల ట్రెండ్స్ వారికి అనుకూలంగా లేనందునే ఇదంతా చేస్తున్నారు'' అని ప్రియాంక అన్నారు.


ఏదీ మీ విజన్..?

బీజేపీ చెబుతున్న విజన్ 2047ను ప్రియాంక నిలదీశారు. ''మీరు విజన్ 2047 అంటున్నారు. ఏమిటా విజన్? ఆ విజన్ సాకారం దిశగా గత పదేళ్లలో మీరు ఏం చేశారు? సామాన్య ప్రజానీకానికి సంబంధించి మీ విజన్ ఏమిటి? నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏమి చేస్తున్నారు? ద్రవ్యోల్బణం మాటేమిటి?'' అని ప్రియాంక ప్రశ్నించారు.

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’


వయనాడ్‌లో ప్రచారం..

ప్రియాంక గాంధీ తన సోదురుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తు్న్న వయనాడ్‌లో బుధవారంనాడు ఎన్నికల ప్రచారం సాగించారు. బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఏప్రిల్ 26న కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.


త్యాగధనుల కుటుంబం..

దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందని ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ప్రియాంక అన్నారు. కుటుంబపాలన అంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ''గాంధీ కుటుంబం వారంతా నా కుటుంబ సభ్యులు. వారిని నేనెందుకు సమర్ధించకూడదు. ప్రతి ఫ్యా్మిలీకి ఒక గౌరవం, సిద్ధాంతాలు ఉంటాయి. కుటుంబ సభ్యులంతా ఆ సిద్ధాంతాల కోసం పోరాడతారు. అది మా సాంప్రదాయం. రాముడు చేసింది కూడా ఇదే. నిజమేమిటో ప్రజల ముందుంది. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది. ఆ బాటలోనే మేము ముందుకు సాగుతున్నాం'' అని ప్రియాంక స్పష్టం చేశారు.


నా తల్లి దేశం కోసం మంగళసూత్రం కోల్పోయింది..

కాంగ్రెస్ పార్టీ ప్రజల సంపదం, నగలు, మంగళసూత్రాలను కూడా దోచుకుంటుందని ప్రధాన మంత్రి మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఈ దేశం కోసం తన తల్లి మంగళసూత్రాన్ని త్యాగం చేసిందని గుర్తుచేశారు. ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 07:48 PM