Share News

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?

ABN , Publish Date - May 15 , 2024 | 10:21 PM

Model Code of Conduct: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు.

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది.. ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్లేనా?
Lok Sabha Election 2024

Model Code of Conduct: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ ముగిసింది. దీంతో హమ్మయ్య ఇక ఎన్నికల కోడ్(Election Code) ముగిసిందోచ్ అని చాలా మంది జనాలు ఊపిరి పీల్చుకుంటారు. మరికొందరు ప్రజలు మాత్రం.. ఇంకా దేశ వ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది కదా? ఎన్నికలు కోడ్ మనకు వర్తిస్తుందా? లేక ఎన్నికలు జరిగే ప్రాంతానికే వర్తిస్తుందా? ఇలా అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. మరి ఒక ప్రాంతంలో పోలింగ్ ముగిస్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగుస్తుందా? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం..


దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎక్కడ చూసినా నేతలు, వారి సపోర్టర్స్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల సంఘం మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తుండగా, అందులో నాలుగు దశలు ఓటింగ్ ఇప్పటికే పూర్తయ్యాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎన్నికలు ముగిశాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ కూడా ముగిసింది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సంపూర్ణమయ్యింది.


అయితే, మన రాష్ట్రాల్లో ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు ఒక విషయంలో సందిగ్ధంలో ఉన్నారు. అదే ఎన్నికల కోడ్ తెలుగు రాష్ట్రాల్లో ముగిసినట్లా? లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓటింగ్ ముగిసిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. చాలా మంది ఓటింగ్ పూర్తయిన తర్వాత తమ రాష్ట్రంలో లేదా జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగుస్తుందని భావిస్తుంటారు. కానీ, ఇందులో నిజం లేదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.


వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో మొదటి దశ ఓటింగ్ పూర్తయినప్పటికీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అంటే జూన్ 4 సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నమాట.

For More National News and Telugu News..

Updated Date - May 15 , 2024 | 10:21 PM