Share News

Patanjali: పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:59 AM

పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది.

Patanjali: పతంజలికి షాక్.. ఆ ఉత్పత్తుల లైసెన్స్ క్యాన్సిల్..!!
Patanjali

పతంజలికి మరో షాక్ తగిలింది. పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి ప్రకటించే కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలియజేసింది. పతంజలి దివ్య ఫార్మసీ రూపొందించిన దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ లైసెన్స్ విభాగం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసింది.


ఏం జరిగిందంటే..?

పతంజలి ఉత్పత్తులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆధునిక వైద్య విధానాన్ని పతంజల్లి ఉత్పత్తుల వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబా తప్పుదోవ పట్టిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివిధ వ్యాధులకు పతంజలి ఉత్పత్తుల ద్వారా ఫలితం ఉంటుందని ప్రచారం చేస్తున్నారని వివరించారు. అందుకు సంబంధించి ఆయుర్వేద, యునానీ నుంచి అనుమతి తీసుకోకుండా ప్రచారం చేయడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలో ఉత్తరాఖండ్ అధికారులు పతంజలికి చెందిన 14 ఉత్పత్తులపై సస్పెన్షన్ విధించారు.

Read National News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 07:59 AM