Share News

Kejriwal: రామాలయ ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేయండి.. కేజ్రీవాల్ కు లేఖ..

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:33 AM

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు

Kejriwal: రామాలయ ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేయండి.. కేజ్రీవాల్ కు లేఖ..

అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కొద్ది రోజుల క్రితం ఒక లేఖ వచ్చింది. వేడుకకు అధికారిక ఆహ్వానంగా తాను వచ్చే తేదీలను కన్ఫార్మ్ చేయాలని ఆ లేఖలో ఉంది. ఈ మేరకు పార్టీ వర్గాలు వివరాలు వెల్లడించాయి. రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల కార్యక్రమంగా పేర్కొంటూ.. రామలల్లా 'ప్రాణ్ప్రతిష్ట' వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, సోనియాగాంధీ, అధీర్‌ రంజన్‌ చౌదరిలు అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మన దేశంలో లక్షలాది మంది రాముడిని పూజిస్తారు. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు చాలా కాలంగా అయోధ్యలోని ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ప్రారంభించారు. 2019 నాటి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి, రాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ నేతలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాయని పార్టీ శ్రేణులు తెలిపాయి.

జనవరి 22న జరిగే వేడుకలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక ఏడు రోజుల పాటు జరగనుంది.

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 10:33 AM