Share News

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:56 AM

కేంద్రంలోని బీజేపీ పాలకులు తెల్లదొరల్లాగా విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావని మరో స్వాతంత్య్ర సంగ్రామమని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు.

Kanimozhi: ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావు.. మరో స్వాతంత్య్ర సంగ్రామం.. ఆలోచించండి!

- మదురైలో కనిమొళి

చెన్నై: కేంద్రంలోని బీజేపీ పాలకులు తెల్లదొరల్లాగా విభజించు పాలించు అనే విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కావని మరో స్వాతంత్య్ర సంగ్రామమని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) అన్నారు. మదురైలో సీపీఎం అభ్యర్థి వెంకటేశన్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పదేళ్లుగా తమిళ ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రానికి అవసరమైన నిధులు విడుదల చేయకుండా బీజేపీ ప్రభుత్వం నిరంకుశత్వాన్ని చాటిచెప్పుకుందని విమర్శించారు. మదురైకి అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని అడిగితే ససేమిరా కుదరదని చెబుతున్న మోదీ ఎవరూ అడగకనే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశారన్నారు. పదేళ్లుగా కార్పొరేట్‌ సంస్థలకు అండగా ఉంటూ రూ.65వేల కోట్ల మేరకు రుణాలను మాఫీ చేశారని పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Lok Sabha Elections: రూ.50వేలకు మించి ఉంటే స్వాధీనమే..

Updated Date - Apr 05 , 2024 | 11:56 AM