Share News

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. 50 ఏళ్లు దాటినా..

ABN , Publish Date - Apr 04 , 2024 | 03:49 PM

సినీ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు.

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ వ్యంగ్యాస్త్రాలు.. 50 ఏళ్లు దాటినా..

సినీ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీలపై (Rahul Gandhi) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) ఇద్దరూ.. తల్లి ఒత్తిడి మేరకు బలవంతంగా రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. తమ ఇష్టాలకు అనుగుణంగా సొంతంగా జీవించేందుకు ఆ ఇద్దరికి అనుమతి ఇవ్వాలని అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ..

‘‘3 ఇడియట్స్ సినిమాలో చూపించినట్టు.. పిల్లలు పరివార్‌వాదానికి గురవుతున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ పరిస్థితి కూడా అంతే. ఆయన తల్లి సోనియా ఆకాంక్షలకు బాధితుడు అయ్యాడు’’ అని కంగనా రనౌత్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లోనే ఉండాలని రాహుల్, ప్రియాంకాలను సోనియా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 50 ఏళ్లు పైబడినప్పటికీ.. పాలిటిక్స్‌లో రాహుల్ ప్రతిసారి యువనేతగా రీలాంచ్ అవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన ఒత్తిడికి గురవుతున్నాడని, ఒంటరితనంతో బాధపడుతున్నాడని తాను భావిస్తున్నానని చెప్పారు. బహుశా రాహుల్ మరో రంగంలో అడుగుపెట్టి ఉంటే, అతను బాగా రాణించి ఉండేవాడేమోనని అభిప్రాయపడ్డారు.


ఒకవేళ రాహుల్ గాంధీ సినిమాల్లో నటించి ఉంటే, అతను కచ్ఛితంగా గొప్ప నటుడు అయ్యుండేవాడని కంగనా రనౌత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తల్లి సోనియా ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరని, వారికి సంపద కొరత ఏమాత్రం లేదని అన్నారు. రాహుల్ ఓ మహిళతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే రూమర్లు తాను విన్నానని, కానీ ఆయన పెళ్లి మాత్రం చేసుకోవడం లేదని చెప్పారు. ఇదే సమయంలో.. తాను ప్రజలకు సేవ చేసేందుకే బీజేపీలో చేరానని వివరణ ఇచ్చారు. 20 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్న తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని, ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నానని కంగనా చెప్పుకొచ్చారు.

Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..

ఇదిలావుండగా.. సినీ పరిశ్రమలో నటిగా ఓ వెలుగు వెలిగిన కంగనా రనౌత్ గత కొంతకాలం నుంచి వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆమె సినిమాలు కనీస వసూళ్లు కూడా రాబట్టలేక సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయ నాయకురాలిగా తన చరిష్మా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై (PM Narendra Modi) ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 03:53 PM