Share News

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

ABN , Publish Date - Feb 24 , 2024 | 06:06 PM

దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.

IRCTC: రైలు ప్రయాణీలకు గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లల్లో ఆ సేవలు సైతం..

దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ సహకారం అందించనుంది. త్వరలో ఈ విధానం అమలులోకి వస్తుందని తెలిపింది. మొదటి దశలో బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానుంది. ప్రయాణం సమయంలో రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారం అందించడం ద్వారా వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయవచ్చని స్విగ్గీ అభిప్రాయపడింది.

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో ఒప్పందం చేసుకోవడం ఐఆర్సీటీసీకి ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబర్‌లో న్యూ దిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో , వారణాసితో సహా పలు రైల్వే స్టేషన్‌లలో ముందస్తు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ సేవలను అందించడానికి జొమాటోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ పోర్టల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా సులభమైన ప్రక్రియ. అందుబాటులో ఉన్న వివిధ రెస్టారెంట్ లను ఎంపిక చేసి, పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.


మరోవైపు.. స్విగ్గీ ఇటీవలే లక్షద్వీప్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. అగట్టి ద్వీపంలో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. లక్షద్వీప్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించినందుకు స్విగ్గీ రికార్డు సృష్టించింది. లక్షద్వీప్‌లో వాహనాలను ఉపయోగించకుండా సైకిల్‌ ద్వారా కస్టమర్లకు ఆర్డర్లు అందిస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తుండటం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 06:06 PM