Share News

Online Booking: టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు.. ఇలా చేయాలన్న IRCTC

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:52 PM

IRCTC యాప్, వెబ్‌సైట్‌లో ఈరోజు మళ్లీ సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో టిక్కెట్ సేవలకు అంతరాయం కలిగింది. అయితే డిసెంబర్ నెలలోనే ఇలా జరగడం రెండోసారి. దీంతో అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

Online Booking: టికెట్ల బుకింగ్‌లో ఇబ్బందులు.. ఇలా చేయాలన్న IRCTC
IRCTC Face Ticket Booking

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్‌లో మళ్లీ సాంకేతిక లోపం కనిపించింది. దీని కారణంగా ప్రయాణికులు తమ ప్రయాణానికి తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోలేక పోయారు. నివేదికల ప్రకారం ఈరోజు (డిసెంబర్ 31న) ఉదయం 10 గంటలకు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. బుకింగ్‌లో అంతరాయం కారణంగా ప్లాట్‌ఫారమ్‌కు చేరుకునే ప్రయాణికులు వచ్చే ఒక గంట పాటు అన్ని సైట్‌లలో బుకింగ్ సదుపాయం అంతరాయం కలిగి ఉంటుందని రైల్వే నుంచి ప్రకటన వెలువడింది. ఒక్కసారిగా అంతరాయం కలగడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


వరుసగా రెండోసారి

అయితే IRCTC వెబ్‌సైట్‌లో ఈ లోపం కనిపించడం ఈ సంవత్సరం చివరి డిసెంబర్ నెలలో ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. దీని కారణంగా అనేక మంది ప్రయాణికుల తత్కాల్ టిక్కెట్ బుకింగ్ విషయంలో అంతరాయం ఏర్పడింది. టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌పైకి చేరుకున్న ప్రయాణికులకు ఒక గంట పాటు అన్ని సైట్‌లకు బుకింగ్, రద్దు ఉంటుందని ప్రకటించారు. దీంతో ఆయా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. అంతకుముందు డిసెంబర్ 26న కూడా IRCTC సర్వర్ నిలిచిపోయింది.


వెబ్‌సైట్‌లో సమాచారం

IRCTC వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినప్పుడు, వినియోగదారులు అన్ని సైట్‌లలో తదుపరి ఒక గంట వరకు బుకింగ్‌లు అందుబాటులో ఉండవనే సందేశాన్ని చూశారు. ఈ అంశంపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కానీ టికెట్ బుకింగ్ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నంబర్‌లు 14646,08044647999, 08035734999 లేదా ఇమెయిల్ ద్వారా etickets@irctc.co.in సంప్రదించాలని IRCTC సూచించింది.


టికెట్ బుకింగ్‌లో ఇబ్బంది

దీంతో అనేక మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం ఈ సాంకేతిక లోపం కారణంగా దాదాపు 47 శాతం మంది వినియోగదారులు వెబ్‌సైట్‌కి లాగిన్ కాలేకపోయారు. అయితే 42 శాతం మంది యాప్ ద్వారా సమస్యలను ఎదుర్కొన్నారు. అదనంగా 10 శాతం మంది వినియోగదారులు టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ సమస్య కారణంగా చాలా మంది వినియోగదారులు టికెట్ బుకింగ్‌లో వైఫల్యాన్ని ఎదుర్కొన్నారు. ప్రధానంగా న్యూ ఇయర్ రోజున ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వారు కూడా ఇబ్బందులు పడ్డారు. కానీ మధ్యాహ్నం ఒకటి తర్వాత వైబ్ సైట్ (https://www.irctc.co.in/nget/train-search) యాథావిధిగా పనిచేస్తుంది.


ఇవి కూడా చదవండి:

Year End Sunrise: 2024 చివరి సూర్యోదయం ఎందుకంత స్పెషల్


Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Read More National News and Latest Telugu News

Updated Date - Dec 31 , 2024 | 01:54 PM