Share News

Indore: తగ్గేదేలే.. ర్యాంకింగ్ లో మరో సారి నెంబర్ వన్ గా ఇండోర్...

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:38 PM

పరిశుభ్రత విషయంలో ఇప్పటికే సిక్స్ కొట్టిన ఇండోర్.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుకుని మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

Indore: తగ్గేదేలే..  ర్యాంకింగ్ లో మరో సారి నెంబర్ వన్ గా ఇండోర్...

పరిశుభ్రత విషయంలో ఇప్పటికే సిక్స్ కొట్టిన ఇండోర్.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుకుని మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవస మునిసిపల్ కమిషనర్ హర్షికా సింగ్‌లకు స్వచ్ఛ సర్వేక్షణ్ - 2023 అవార్డులు అందించారు. 2017 నుంచి వరసగా ఇండోర్ నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. ప్రజల భాగస్వామ్యం, సహకారం, సమన్వయం వల్లే ఈ ఘనత సాధించామని ఇండోర్ అధికారులు వెల్లడించారు.

భారత్ లోని ఇతర నగరాలు మనల్ని అనుసరిస్తున్నాయని.. ఈ ట్రెండ్ ను భవిష్యత్ లోనూ కొనసాగిస్తామని ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ అన్నారు. మనం సాధించిన విజయాలను గతంలోనూ ప్రధాని మోదీ ప్రశంసించారన్నారు. ఇండోర్‌లో విజయం సాధించాలనే అభిరుచి, సంకల్పం రెండూ ప్రజలకు, అధికారులకు ఉన్నాయని కొనియాడారు. ఇండోర్ వాసులు ఈ వేడుకను వీక్షించేందుకు వీలుగా లోకల్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. కార్పొరేషన్ కార్మికులు డప్పులు, కార్డులతో ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.


ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ బృందం రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుని గురువారం రాత్రి సుమారు 8.30 గంటలకు ఢిల్లీ నుంచి ఇండోర్ చేరుకుంటుంది. వీరు నేరుగా విమానాశ్రయం నుంచి రాజ్‌వాడ చేరుకుంటారు. ఇక్కడ అహల్యా దేవికి పూలమాల వేసి ఉత్సవాలు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 03:39 PM