Share News

Indian Navy: సముద్ర దొంగల చేతిలో చిక్కుకున్న పాక్ జాలర్లను రక్షించిన ఇండియన్ నేవి

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:15 AM

భారత్‌ నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలనే ధర్మాన్ని నిర్వర్తించింది.

Indian Navy: సముద్ర దొంగల చేతిలో చిక్కుకున్న పాక్ జాలర్లను రక్షించిన ఇండియన్ నేవి

భారత్‌ నేవీ మరోసారి దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. శత్రువైనా, మిత్రుడైనా ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలనే ధర్మాన్ని నిర్వర్తించింది. సోమాలియా సముద్రపు దొంగల చేతికి చిక్కుకున్న 19 మంది దాయాదీ దేశస్థులను చెర నుంచి విడిపించింది. సోమాలియా తూర్పు తీరంలో ఇరాన్‌ జెండాతో వెలుతున్న ఓ వర్తక నౌకను అడ్డగించిన సముద్రపు దొంగలు అందులోని 19 మందిని బందీలుగా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ యుద్ధ నౌక INS సుమిత్ర వారిని రక్షించింది. భారత నావికాదళానికి ఒకే రోజులో ఇది రెండో రెస్క్యూ ఆపరేషన్ కావడం విశేషం.

"మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 30 , 2024 | 12:34 PM