Share News

India Stands: ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పిరికి చర్యగా పేర్కొన్న

ABN , Publish Date - Mar 23 , 2024 | 11:08 AM

రష్యా(russia) రాజధాని మాస్కో(moscow)లోని క్రాకాస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు.

India Stands: ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పిరికి చర్యగా పేర్కొన్న

రష్యా(russia) రాజధాని మాస్కో(moscow)లోని క్రాకాస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు. ''మాస్కోలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి(terrorist attack)ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషాద సమయంలో భారతదేశం రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుందని'' తెలిపారు.

మరోవైపు దీనిని "హేయమైన, పిరికి ఉగ్రవాద దాడి"గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(United Nations Security Council) పేర్కొంది. దీంతోపాటు ఈ ఘటనపై అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐక్యరాజ్యసమితి కూడా సంతాపం వ్యక్తం చేశాయి. ఈ క్రూరమైన దాడికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ బాధ్యత వహించింది. ఈ దాడిలో ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించగా, 140 మందికి పైగా గాయపడ్డారు.


ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) ఆకాంక్షించారు. పుతిన్ 6 సంవత్సరాలకు కొత్త పదవీకాలానికి తిరిగి ఎన్నికైన క్రమంలో ఈ దాడి జరగడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. క్రెమ్లిన్ ప్రకారం దాడి జరిగిన వెంటనే పుతిన్‌కు సమాచారం అందించారు. ఆ క్రమంలో అప్రమత్తమైన పుతిన్ అదనంగా దళాలను పంపించారు. దీంతోపాటు రష్యా విమానాశ్రయాలు, ప్రయాణ కేంద్రాలు సహా రాజధాని అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే మాస్కోలో ఉగ్రవాదులు మార్చి 7న పెద్ద సమావేశాలను లక్ష్యంగా చేసుకోవచ్చని, ఈ దాడిలో సంగీత కచేరీలు కూడా ఉన్నాయని బహిరంగ హెచ్చరికలు జారీ చేశామని అమెరికా(america) జాతీయ భద్రతా మండలి చెబుతోంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనిని కొట్టిపారేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Attack Video: కాన్సర్ట్ హాల్‌పై కాల్పులు.. 60 మంది మృతి, 115 మందికి గాయాలు

Updated Date - Mar 23 , 2024 | 11:09 AM