Share News

Attack Video: కాన్సర్ట్ హాల్‌పై కాల్పులు.. 60 మంది మృతి, 115 మందికి గాయాలు

ABN , Publish Date - Mar 23 , 2024 | 07:01 AM

రష్యా రాజధాని మాస్కో(Moscow)లో దారుణం చోటుచేసుకుంది. క్రోకస్ సిటీలోని కాన్సర్ట్ హాల్‌(concert hall)పై ఐదుగురు ముష్కరులు వచ్చి ఆకస్మాత్తుగా కాల్పులు(Shooting) జరిపి బాంబులతో దాడి చేశారు. దీంతో 60 మందికిపైగా మృత్యువాత చెందగా, మరో 115 మంది గాయపడ్డారు.

Attack Video: కాన్సర్ట్ హాల్‌పై కాల్పులు.. 60 మంది మృతి, 115 మందికి గాయాలు

రష్యా(russia) రాజధాని మాస్కో(Moscow)లో దారుణం చోటుచేసుకుంది. క్రోకస్ సిటీలోని కాన్సర్ట్ హాల్‌(concert hall)పై ఐదుగురు ముష్కరులు వచ్చి ఆకస్మాత్తుగా కాల్పులు(Shooting) జరిపి బాంబులతో దాడి చేశారు. దీంతో 60 మందికిపైగా మృత్యువాత చెందగా, మరో 115 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు, మంత్రులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 115 మందిలో 60 మంది పరిస్థితి విషమంగా ఉందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధిపతి మురాష్కో తెలిపారు.

అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(Islamic State group) ప్రకటించింది. సాయుధ ఉగ్రవాదులు మాస్కో సమీపంలోని క్రోకస్ సిటీ హాల్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ప్రజలపై బుల్లెట్లు, బాంబులతో దాడులు చేశారు. రాక్ బ్యాండ్ పిక్నిక్ ప్రదర్శనకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ గుమిగూడారు. ఈ క్రమంలో కళాకారులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని బ్యాండ్ మేనేజర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. కచేరీ ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు ముసుగులు ధరించిన వ్యక్తులు హాల్‌లోకి ప్రవేశించారని ఆయన అన్నారు.


మాస్కో సమీపంలోని క్రోకస్ సిటీ హాల్‌(city hall)లో కచేరీ హాల్, షాపింగ్ సెంటర్ ఉన్నాయి. దీనిలో 6 వేల మందికిపైగా కూర్చునే అవకాశం కలదు. ఈ దాడికి సంబంధించిన వీడియోలలో సిటీ హాలులో మంటలు కనిపించాయి. ఆ క్రమంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అయితే దుండగులు ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపి, బాంబులను విసిరారని రష్యా ప్రభుత్వ ఏజెన్సీ నోవోస్టి తెలిపింది. ఆ తర్వాత ఉగ్రవాదులు కారులో పారిపోయారని ఏజెన్సీ వెల్లడించింది.

ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా అభివర్ణించిన రష్యా(russia) అత్యున్నత సంస్థచే దర్యాప్తు చేస్తోంది. నేర పరిశోధన ప్రారంభించినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది. అయితే దాడి వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. క్రోకస్ సిటీ హాల్‌పై జరిగిన ఈ దాడి గత సంవత్సరాల్లో రష్యాలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన సమయంలో ఈ దాడి జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: PM Narndra Modi: భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'డ్రూక్ గ్యాల్పో' అందుకున్న మోదీ

Updated Date - Mar 23 , 2024 | 07:17 AM