Share News

Lok Sabha Results: ఊహించని దిశగా యూపీలో ఫలితాలు..

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:44 AM

లోక్‍‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' కూటమి అనూహ్యమైన ఫలితాల దిశగా దూసుకు వెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కంటే 'ఇండియా' బ్లాక్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Lok Sabha Results: ఊహించని దిశగా యూపీలో ఫలితాలు..

న్యూఢిల్లీ: లోక్‍‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి అనూహ్యమైన ఫలితాల దిశగా దూసుకు వెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కంటే 'ఇండియా' (I.N.D.I.A.) బ్లాక్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో 41 నియోజకవర్గాల్లో కూటమి లీడింగ్‌లోకి వెళ్లింది. ముస్లిం-యాదవ్-ఓబీసీల ఓట్లను గణనీయంగా 'ఇండియా' కూటమి రాబట్టుకున్నట్టు ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. 'ఇండియా' కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఇక్కడ కలిసి పోటీ చేశాయి. అఖిలేష్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ 62 సీట్లలో, కాంగ్రెస్ 17 సీట్లలో పోటీలో ఉన్నాయి. 2019 యూపీ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 62 సీట్లు గెలుచుకోగా, బహుజన్ సమాజ్ పార్టీ 10, సమాజ్‌వాది పార్టీ 5 సీట్లు గెలుచుకున్నాయి.

Read Latest International News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 11:44 AM