Share News

Himachal Pradesh: మండు వేసవిలో హిమపాతం.. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ రాష్ట్రాలు..

ABN , Publish Date - Mar 31 , 2024 | 10:23 AM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిలో వేసవి ( Summer ) తీవ్రత అధికంగా ఉంది. ఉత్తర భారతంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో మంచు కొండల్లో నెలవైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లో భారీ హిమపాతం సంభవించింది.

Himachal Pradesh: మండు వేసవిలో హిమపాతం.. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ రాష్ట్రాలు..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిలో వేసవి ( Summer ) తీవ్రత అధికంగా ఉంది. ఉత్తర భారతంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో మంచు కొండల్లో నెలవైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లో భారీ హిమపాతం సంభవించింది. కొండ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. జాతీయ రహదారులపై దట్టంగా మంచు పేరుకుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 4 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్థానిక వాతావరణ కేంద్రం వెల్లడించింది.

23 మంది పాకిస్థానీయులను కాపాడిన నేవీ

హిమాచల్ రోడ్డు రవాణాకు చెందిన ఓ బస్సు విపరీతమైన మంచు కారణంగా కిన్నౌర్ జిల్లాలోని మాలింగ్ సమీపంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవండతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హిమాచల్ లోని సిమ్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, సోలన్‌లో వడగళ్ల వాన కురిసింది. ఈ మేరకు వాతావరణ కార్యాలయం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 31 , 2024 | 10:23 AM