Share News

Shock To Congress Party: కాంగ్రెస్ పార్టీకి అశోక్ చవాన్ రాజీనామా, బీజేపీలో చేరే అవకాశం

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:05 PM

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవీకి చేసిన రాజీనామా లేఖను స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సమర్పించారని తెలిసింది.

Shock To Congress Party: కాంగ్రెస్ పార్టీకి అశోక్ చవాన్ రాజీనామా, బీజేపీలో చేరే అవకాశం

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ చవాన్ (Ashok Chavan) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవీకి చేసిన రాజీనామా లేఖను స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సమర్పించారని తెలిసింది. ఆదివారం స్పీకర్ రాహుల్‌తో చవాన్ సమావేశం అయ్యారు. రాహుల్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. త్వరలో రాజ్య సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చవాన్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చవాన్‌ బీజేపీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

కీలక నేతలు గుడ్ బై

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. బాబా సిద్దిఖీ, మిలింద్ దేవరా ఇప్పటికే పార్టీ వీడిన సంగతి తెలిసిందే. బాబా సిద్దిఖీ అజిత్ పవార్ ఎన్సీపీలో చేరారు. మిలింద్ దేవరా ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలో చేరారు. ఇప్పుడు చవాన్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక్కో నేత దూరం అవుతూ వస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 01:05 PM