Share News

BJP: బీజేపీలోకి కమల్‌నాథ్..? ఆయన కుమారుడు నకుల్‌నాథ్..!!

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:32 PM

లోక్ సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగలనుంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తీరుతో గుర్రుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, అతని కుమారుడు నకుల్ నాథ్ పార్టీ వీడతారని తెలుస్తోంది. కమల్ నాథ్ పార్టీ వీడే అంశంపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతుంది.

BJP: బీజేపీలోకి కమల్‌నాథ్..? ఆయన కుమారుడు నకుల్‌నాథ్..!!

భోపాల్: లోక్ సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగలనుంది. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తీరుతో గుర్రుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamalnath), అతని కుమారుడు నకుల్ నాథ్ (Nakul nath) పార్టీ వీడతారని తెలుస్తోంది. కమల్ నాథ్ పార్టీ వీడే అంశంపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతుంది. పార్టీ వీడటం లేదని కమల్ నాథ్ శుక్రవారం కూడా స్పష్టత ఇచ్చారు. కమల్, లేదంటే అతని కుమారుడు బీజేపీలో చేరే అవకాశం ఉంది.

కమల్‌నాథ్ మాజీ మీడియా ప్రతినిధి నరేంద్ర సలుజా సోషల్ మీడియాలో ఎక్స్‌లో చేసిన పోస్ట్ చర్చకు దారితీసింది. కమల్ నాథ్, నకుల్ నాథ్‌తో ఉన్న ఫొటో షేర్ చేసి, జై శ్రీరాం అని రాశారు. దీంతో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ వీడటం ఖాయం అని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. నకుల్ నాథ్ ఛింద్వారా నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తన ఎక్స్ ఖాతాలో గల ప్రొఫైల్ బయో నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించారు. అప్పటినుంచి పార్టీ వీడటంపై ప్రచారం జరుగుతోంది.

‘గాంధీ నెహ్రూ కుటుంబంతో కలిసి కమల్ నాథ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అలాంటి ఆయన పార్టీ వీడతారని ఎలా అనుకుంటాం. ఇలా ఏ రోజు ఆలోచించలేం అని’ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయ పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 03:32 PM