Share News

Arun Goel Resigns: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:19 PM

న్యూఢిల్లీ, మార్చి 09: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌(Election Commission) అరుణ్‌ గోయెల్‌(Arun Goel) కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి(President of India) పంపగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Arun Goel Resigns: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా
Election Commissioner Arun Goel Resigns

న్యూఢిల్లీ, మార్చి 09: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌(Election Commission) అరుణ్‌ గోయెల్‌(Arun Goel) కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి(President of India) పంపగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ మాత్రమే మిగిలి ఉన్నారు.

మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, గోయెల్ రాజీనామా వల్ల ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడొచ్చని విశ్లేషకలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 09:20 PM