Share News

Kejriwal Arrest: ఆ వ్యూహాల కోసమే కేజ్రీవాల్ ఫోన్‌పై దృష్టి.. ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:52 PM

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ బీజేపీ రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించి, ఆమ్‌ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

Kejriwal Arrest: ఆ వ్యూహాల కోసమే కేజ్రీవాల్ ఫోన్‌పై దృష్టి.. ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై (Enforcement Directorate) ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ (Atishi Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ బీజేపీ (BJP) రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Admi Party) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వ్యూహాలను తెలుసుకోవాలని ఈడీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Roasted brinjal: కాల్చిన వంకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? షుగర్ ఉన్నవారు దీన్ని తింటే ఏం జరుగుతుందంటే..!


అతిషి మాట్లాడుతూ.. ‘‘కేజ్రీవాల్ ఫోన్‌ని పరిశీలించాలని ఈడీ పట్టుబడుతోంది. నిజానికి.. ఎక్సైజ్ పాలసీని రూపొందించి, అమలు చేసినప్పుడు ఆ మొబైల్ ఫోన్ ఉనికిలోనే లేదు. ఇది కొన్ని నెలల క్రితం నాటిది మాత్రమే. అయినా ఆ ఫోన్ కావాలని ఈడీ పట్టుబట్టడాన్ని చూస్తుంటే.. ఆ ఏజెన్సీ బీజేపీ రాజకీయ ఆయుధంగా పని చేస్తున్నట్టు స్పష్టమవుతోంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి.. ఆ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటోంది బీజేపీ అని, ఈడీ కాదని వ్యాఖ్యానించారు. ఎక్సైస్ పాలసీని (Excise Policy) అమలు చేసినప్పుడు కేజ్రీవాల్ వద్ద ఉండే ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదని స్వయంగా ఈడీ చెప్పిందని.. అయితే ఇప్పుడు కొత్త ఫోన్ పాస్‌వర్డ్ కావాలని ఆ ఏజెన్సీ కోరుతోందని చెప్పారు. పాస్‌వర్డ్ ఇవ్వకపోవడం వల్ల.. మరికొన్ని రోజులు కస్టడీ అవసరమని ఈడీ న్యాయవాది కోర్టులో చెప్పారని ఆమె గుర్తు చేశారు.

Cyber Crimes: ఈ నంబర్ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయా.. అయితే డేంజర్‌లో ఉన్నట్లే

ఈ కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్‌వర్డ్ అడగడం లేదని, కేజ్రీవాల్‌ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని అతిషి ఆరోపించారు. ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, ఇండియా కూటమి నాయకులతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్ మీడియా వ్యూహాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. అలాగే.. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, అస్సాంలలో మొత్తం 22 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ వ్యూహాన్ని బీజేపీ తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. అయితే.. దీనిపై ఈడీ నుంచి తక్షణమే స్పందన రాలేదు. మరోవైపు.. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరచుగా తమ ఫోన్‌లు ఎందుకు మార్చారో వివరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2024 | 04:27 PM