Share News

Roasted brinjal: కాల్చిన వంకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? షుగర్ ఉన్నవారు దీన్ని తింటే ఏం జరుగుతుందంటే..!

ABN , Publish Date - Mar 30 , 2024 | 03:42 PM

అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు తొలగించుకోవడానికి కాల్చిన వంకాయలను తినడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. దీని గురించి అసలు నిజాలివీ

Roasted brinjal:   కాల్చిన వంకాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా? షుగర్  ఉన్నవారు దీన్ని తింటే ఏం జరుగుతుందంటే..!

ప్రస్తుతకాలంలో ఆహారం విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఆహారంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువైంది. దీని కారణంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో చేరే అధిక కొలెస్ట్రాల్ కారణంగా సిరల్లో ఫలకం పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో గ్లూకోజ్ గణనీయంగా పెరుగుతుంది. అయితే అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు తొలగించుకోవడానికి వంకాయలను తినడం వల్ల మంచి ప్రయోజనముంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. అయితే దీన్ని కాల్చి తినాలని అంటున్నారు. కాల్చిన వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్..

కాల్చిన వంకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.ప్రతిరోజూ కాల్చిన వంకాయలను తిన్నప్పుడు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌లో తగ్గుదల గణనీయంగా ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


మధుమేహం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు వంకాయల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పరిశోధన ప్రకారం వంకాయలలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

స్థూలకాయం..

స్థూలకాయంతో ఇబ్బంది పడేవారు, బరువు తగ్గాలని అనుకునేవారు కాల్చిన వంకాయ తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాల్చిన వంకాయ తిన్న తరువాత ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. రోజు మొత్తం తీసుకునే కేలరీలను తగ్గిస్తుంది.

క్యాన్సర్ కణాలు..

శరీరంలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభమైనప్పుడు అది క్యాన్సర్ గా మారుతుంది. కాల్చిన వంకాయ తినడం వల్ల ఈ కణాలు నశిస్తాయి. ఇలాంటి ఆహారాలలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే SRG సమ్మేళనం ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 03:42 PM