Share News

Election Commission: దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ సీరియస్ వార్నింగ్

ABN , Publish Date - Apr 01 , 2024 | 03:42 PM

మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ను ఎలక్షన్ కమిషన్ సోమవారంనాడు మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది.

Election Commission: దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌కు ఈసీ సీరియస్ వార్నింగ్

న్యూఢిల్లీ: మహిళలను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ (Dilip Ghosh), కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ (Supriya Shrinate)ను ఎలక్షన్ కమిషన్ (Election commission) సోమవారంనాడు మందలించింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది. పశ్చిమబెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ, కంగనా రౌనౌత్‌లను కించపరచే విధంగా వారిరువురూ వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ నిర్ధారించింది.


దిలీప్ ఘోష్, సుప్రియ శ్రీనేత్‌‌పై వచ్చిన ఫిర్యాదులపై వారి నుంచి వివరణ తీసుకున్న ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాలు జారీ చేసింది. వారిరువురూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించి, వ్యక్తిగత దాడి (విమర్శలు)కి పాల్పడినట్టుగా తాము నిర్ధారణకు వచ్చామని, ఎంసీసీ అమల్లో ఉన్నందున పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వారిని ఈసీ హెచ్చరించింది. ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలని సూచించింది. గత మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.


దిలీప్ ఘోష్, సుప్రియా ఏమన్నారంటే?

దీలీప్ ఘోష్ ఇటీవల మమతా బెనర్జీపై విమర్శలు గుప్పిస్తూ, దీదీ (మమతాబెనర్జీ) గోవాకు వెళ్తే గోవా డాటర్‌గా, త్రిపుర వెళ్తే త్రిపుర డాటర్‌గా చెప్పుకుంటారనీ, అసలు ఆమె తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తు్న్న నటి కంగనా రనౌత్‌పై సుప్రియా శ్రీనేత్ ఒక ట్వీట్ చేశారు. ''మండిలో ప్రస్తుతం రేటెంత?'' అంటూ సుప్రియ చేసిన ట్వీట్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 03:45 PM