Share News

India: ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నారో మీకు తెలుసా..??

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:27 PM

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇన్నాళ్లు రికార్డుల్లో పేరుమోసిన చైనా.. భారత్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. ఇండియాలో తాజాగా జనగణన జరగకపోయినప్పటికీ జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ (India) మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

India: ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నారో మీకు తెలుసా..??

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇన్నాళ్లు రికార్డుల్లో పేరుమోసిన చైనా.. భారత్ దెబ్బకు రెండో స్థానానికి పడిపోయింది. ఇండియాలో తాజాగా జనగణన జరగకపోయినప్పటికీ జనాభాలో చైనాను వెనక్కి నెట్టిన భారత్ (India) మొదటి స్థానంలో నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారతీయులు విద్య, ఉపాధి కోసం స్వదేశాన్ని వదిలి విదేశాలకు వలస పోతున్నారు. దీంతో ప్రపంచ దేశాల్లోనూ మన వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రపంచంలో భారత్ తర్వాత అత్యధిక భారత జనాభా ఉన్న దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రదేశాలలో చాలా వరకు 'మినీ ఇండియా'ను కలిగి ఉంది. ఆ దేశజనాభాలో ఇండియన్స్ పర్సంటేజ్ సైతం ఆదేశం మొత్తం జనాభాలో భాగంగా ఉండటం విశేషం.

భారతీయుల జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషస్‌ మొదటి స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 70% మంది ఇండియన్స్ ఉన్నారు. ఆ తర్వాత బ్రిటన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశంలోని అనేక భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు, సాంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ అనుభవాలు తాము భారత్ ను వదిలి వచ్చేశాం అనే అనుభూతి కలగనీయకండా తాము స్వదేశంలోనే ఉన్నామనే భావనను రేకెత్తిస్తాయి. ఆ తర్వాతి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ప్రవాస భారతీయులకు ఎమిరేట్స్ స్వర్గధామంగా ఉంది.


సౌదీ అరేబియా దేశం మొత్తం జనాభాలో 10% నుంచి 13% వరకు ప్రవాస భారతీయులు ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రవాస సంఘం భారతీయులు సౌదీ సమాజంలో కలిసిపోతున్నారు. వారితో మమేకమవుతున్నారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణం, ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు కెనడా పేరుగాంచింది. ఒమన్ మొత్తం జనాభాలో సుమారు 20% భారతీయులే ఉన్నారు. 2023 నాటికి దాదాపు 9 లక్షల మంది భారతీయులకు ఒమన్ స్థానం కల్పించడం విశేషం.

లిటిల్ ఇండియా పేరుతో సింగపూర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకర్షిస్తోంది. 2023 నాటికి సింగపూర్‌లో భారతీయ జనాభా 7 లక్షలకు పెరిగింది. ఆ తరువాతి స్థానంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ 2-7 మిలియన్ల వరకు భారతీయులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కెరీర్ నిర్మాణం, ఉద్యోగం, ఉన్నత జీవనం కోసం అమెరికాకు వస్తున్నారు.

ఇవీ చదవండి..

Google: గూగుల్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ మ్యాట్రిమోనీ యాప్ లు పనిచేయవు..

Summer: ఈ వేసవికాలం నిప్పుల కుంపటే.. ఐఎండీ హెచ్చరిక..

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 06:36 PM