Share News

Rajokot Gaming Zone fire: గుజరాత్ సర్కార్‌పై శివాలెత్తిన హైకోర్టు

ABN , Publish Date - May 27 , 2024 | 04:39 PM

గుజరాత్‌ లోని రాజ్‌కోట్ గోమింగ్ జోన్‌లో గత శనివారంనాడు జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిన్నారులతో సహా 27 మంది మరణించడంపై ఇప్పటికే గుజరాత్ సర్కార్‌పై తీవ్ర ఆక్షేపణ తెలిపిన రాష్ట్ర హైకోర్టు మరోసారి కస్సుమంది. సిటీలోని రెండు గేమింగ్స్ జోన్స్ గత రెండేళ్లుగా ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లతో సహా అవసరమైన పర్మిట్లు లేకుండా పనిచేస్తుండటంపై నిప్పులు చెరిగింది.

Rajokot Gaming Zone fire: గుజరాత్ సర్కార్‌పై శివాలెత్తిన హైకోర్టు

రాజ్‌కోట్: గుజరాత్‌ (Gujarat)లోని రాజ్‌కోట్ గోమింగ్ జోన్‌లో గత శనివారంనాడు జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చిన్నారులతో సహా 27 మంది మరణించడంపై ఇప్పటికే గుజరాత్ సర్కార్‌పై తీవ్ర ఆక్షేపణ తెలిపిన రాష్ట్ర హైకోర్టు (Gujarat High court) మరోసారి కస్సుమంది. సిటీలోని రెండు గేమింగ్స్ జోన్స్ గత రెండేళ్లుగా ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లతో సహా అవసరమైన పర్మిట్లు లేకుండా పనిచేస్తుండటంపై సోమవారంనాడు నిప్పులు చెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌కోట్ మున్సిపల్ యంత్రాగం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ.. ''మీరు గుడ్డిగా వెళ్తున్నారా? నిద్రపోతున్నారా? ఇప్పుడు మేము స్థానిక యంత్రాగాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతమాత్రం విశ్వసించలేం'' అని వ్యాఖ్యానించింది.

రాజ్‌కోట్‌ గేమింగ్‌జోన్‌ ప్రమాద తీవ్రతకు కారణం అదే!


గేమింగ్ జోన్‌లో మున్సిపల్ అధికారులు ఉన్న కొన్ని ఫోటోలను రాజ్‌కోట్ మున్సిపల్ అధికారులు కోర్టు ముందుంచగా, వాటిపై కోర్టు మండిపడింది. ''ఈ అధికారులెవరు? ఆలటలాడుకునేందుకు వెళ్లారా? అని ప్రశ్నించింది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ హియరింగ్స్ నాలుగేళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక యంత్రాగాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తాము విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని ఆక్షేపణ తెలిపింది. అహ్మదాబాద్‌లో నడుస్తున్న రెండు అదనపు గేమింగ్ జోన్లు అనుమతి లేకుండా పని చేస్తు్న్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ మనీషా లవ్ కుమార్ షా అంగీరించారు. ఈ అంశాలపై ఇన్వెస్టిగేషన్‌కు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశామని, 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని ఆమె తెలిపారు. మాల్స్ లోపల 34 మినీ-గేమింగ్ జోన్స్ ఉన్నాయని, వాటిలో మూడింటికి ఫైర్ డిపార్ట్‌మెంట్‌ నుంచి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవని, వీటిపై కూడా ప్రత్యేక ఇనన్వెస్టిగేటింగ్ టీమ్ విచారణ జరుపుతుందని కోర్టుకు విన్నవించారు. కాగా, గేమింగ్ జోన్ యజమానులు ముగ్గురుని అరెస్టు చేస్తామని, తక్కిన అనుమానితులను కూడా పట్టుకుంటామని కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హామీ ఇచ్చింది.

Updated Date - May 27 , 2024 | 04:41 PM