Share News

Viral Video: రాష్ట్రపతి భవన్‌లో చిరుత?.. పోలీసుల సమాధానం ఇదే

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:27 PM

ప్రధానిగా మోదీ జూన్ 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ మంత్రి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన వెనక ఓ చిరుత రావడం కనిపించింది. ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు.

Viral Video: రాష్ట్రపతి భవన్‌లో చిరుత?.. పోలీసుల సమాధానం ఇదే

ఢిల్లీ: ప్రధానిగా మోదీ జూన్ 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ మంత్రి ప్రమాణం చేస్తున్నప్పుడు ఆయన వెనక ఓ చిరుత రావడం కనిపించింది. ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు.

అప్పుడు వెనుకాల మెట్లకుపై ప్రాంతంలో చిరుతపులి(Leopard in Rashtrapathi Bhavan) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.


అయితే అది చిరుత కాదని పోలీసులు అంటున్నారు. అది సాధారణ పిల్లి అని వెల్లడించారు. మీడియా, సోషల్ మీడియాలో క్రూర జంతువుగా ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదన్నారు. అయితే పోలీసుల కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

కళ్ల ముందే అంత క్రూరమైన జంతువు కనిపిస్తుంటే చిరుత కాదు, పులి అంటే ఎలా నమ్మాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు వీడియో చూసి.. అది పులో, పిల్లో కనిపెట్టండి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులి?

Updated Date - Jun 10 , 2024 | 09:29 PM