Share News

Congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మరోసారి ఎదురుదెబ్బ.. విషయం ఏంటంటే...

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:14 PM

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌కులకర్ణి(Congress MLA Vinaykulkarni)కి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Congress MLA: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మరోసారి ఎదురుదెబ్బ.. విషయం ఏంటంటే...

బెంగళూరు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వినయ్‌కులకర్ణి(Congress MLA Vinaykulkarni)కి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ధారవాడ జిల్లా హుబ్బళ్లి జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేశ్‌గౌడ హత్య కేసు నుంచి ఉపశమనం కలిగించాలని ధారవాడ ఎమ్మెల్యే కులకర్ణి దాఖలు చేసుకున్న పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో వినయ్‌ కులకర్ణికి న్యాయపోరాటంలో మరోసారి నిరాశ మిగిలింది. బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టు ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతున్న కేసును కొట్టివేయాలని వినయ్‌కులకర్ణి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ ధర్మాసనం సోమవారం తీర్పు ప్రకటించింది. విచారణ వేళ పిటీషనర్‌ తరపు న్యాయవాదులు పలు అంశాలు లేవనెత్తారు. చార్జ్‌షీట్‌లో అంశాలను నిందితుడికి సమకూర్చలేదని, మొదటి ముద్దాయి బసవరాజ్‌ ముత్తగికి మాత్రమే ముందస్తు అనుమతి పొందారని, వినయ్‌కులకర్ణి విషయంలో దాఖలు చేయలేదన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పిటీషన్‌ను కొట్టివేసింది. దీన్నిబట్టి మరింతకాలం ఆయన ధారవాడకు దూరంగానే ఉండాల్సి ఉంటుంది. ధారవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వినయ్‌కులకర్ణికి నగరంలో ప్రవేశించకుండా ఆంక్షలు ఉన్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు నుంచి ఆయన ధారవాడలోకి రాలేకపోయారు.

ఇదికూడా చదవండి: Actor Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Updated Date - Apr 10 , 2024 | 01:14 PM