Share News

Chennai: పొంచి ఉన్న వాయు ‘గండం’.. పది జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , Publish Date - May 25 , 2024 | 11:42 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Chennai: పొంచి ఉన్న వాయు ‘గండం’.. పది జిల్లాలకు భారీ వర్షసూచన

- హార్బర్లపై 1వ నెంబర్‌ హెచ్చరిక

చెన్నై: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఆ వాయుగుండం బంగ్లాదేశ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అది మరింతగా బలపడి ఈశాన్య దిశగా కదలి శనివారం ఉదయం తుఫానుగా మారి ఉత్తరదిశగా కదలి సాయంత్రానికి మరింత బలపడనుందని వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ తుఫాను ఈ నెల 26 అర్థరాత్రి మరింత ఉగ్రరూపం దాల్చి పడమటి బంగాళాఖాతం తీరం సమీపంలోని సాగర్‌ దీవి, కిప్పురావు మధ్య తీరం దాటనుంది.

ఇదికూడా చదవండి: Hyderabad: భార్యను హత్య చేసిన భర్త.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి


మరో అల్పపీడనం...

కేరళ సముద్రతీరంలో ఈశాన్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పది జిల్లాల్లో చెదరుమదురుగా వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని, దిండుగల్‌, నీలగిరి, మదురై, విరుదునగర్‌, తిరుప్పూరు, తిరునల్వేలి జిల్లాల్లో పలు చోట్ల భారీగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయి. గురువారం ఉదయం నుండి శుక్రవారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాల ప్రకారం తిరునల్వేలిలో అత్యధికంగా 10 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.


9 ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ హెచ్చరిక ...

బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారటంతో పుదుచ్చేరి సహా తొమ్మిది ఓడరేవుల్లో ఒకటో నెంబర్‌ సూచిక ఎగురవేశారు. చెన్నై, కడలూరు, నాగపట్టినం, ఎన్నూరు, కాట్టుపల్లి, పుదుచ్చేరి, కారైక్కాల్‌, పాంబన్‌, తూత్తుకుడి హార్బర్‌లలో ఈ సూచికలను ఎగురవేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

గిరిజన గ్రామాన్ని ముంచెత్తిన వర్షం...

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఇరువయల్‌ గిరిజన ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఆ ప్రాంతంలో పలు వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రహదారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఊటీ, కున్నూరు, కోథగిరి పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం నుండి శుక్రవారం వేకువజాము వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఊటీ బోట్‌హౌస్‌ రోడ్డుపై వర్షపు నీరు వరదలా ప్రవహించింది. ఇక రెండు రోజుల వర్షానికి కున్నూరు సమీపం ఇరువయల్‌ గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారుల్లో కూలిన చెట్లను అగ్నిమాపక దళం సభ్యులు తొలగిస్తున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 25 , 2024 | 11:42 AM