Share News

Chennai: 9 జిల్లాలకు భారీ వర్ష సూచన..

ABN , Publish Date - May 16 , 2024 | 01:34 PM

రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండ వేడి అధికం కాకుండా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురవటంతో వాతావరణం తరచూ చల్లబడుతోంది. ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు.

Chennai: 9 జిల్లాలకు భారీ వర్ష సూచన..

చెన్నై: రాష్ట్రంలో అగ్ని నక్షత్రం ఎండ వేడి అధికం కాకుండా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురవటంతో వాతావరణం తరచూ చల్లబడుతోంది. ఈ నేపథ్యంలో తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు పేర్కొన్నారు. రాజధాని నగరం చెన్నైలోనూ పగటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని, ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం కన్నియాకుమారి సహా సముద్రతీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) ప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది జిల్లాలు, కోయంబత్తూరు, ఊటీ తదితర పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అకాల వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Amit Shah: కేజ్రీకి సుప్రీం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌..

దిండుగల్‌, తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్నియాకుమారి, తూత్తుకుడి, విరుదునగర్‌, రామనాధపురం సహా తొమ్మిది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని, గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కన్నియాకుమారి, తిరునల్వేలి, రామనాధపురం, పుదుకోట, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు, తెన్‌కాశి, తేని, దిండుగల్‌, కోయంబత్తూరు జిల్లాల్లో ఒకటీరెండు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ నెల 17 నుంచి 19 వరకు ఉత్తరాది జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రానున్న ఐదు రోజులు చెన్నై, తిరువళ్లూరు సహా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. దిండుగల్‌, నీలగిరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువడంతో వాతావరణం చల్లబడింది.

ఇదికూడా చదవండి: Saptagiri Express: రేణిగుంట వరకే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌...

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 16 , 2024 | 01:34 PM