Share News

Amit Shah: కేజ్రీకి సుప్రీం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌..

ABN , Publish Date - May 16 , 2024 | 02:28 AM

కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్‌కు (కోర్టు) స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్‌ అవుతారంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌ షా స్పందించారు.

Amit Shah: కేజ్రీకి సుప్రీం స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌..

  • ఇది సాధారణ తీర్పని నేను అనుకోవట్లేదు

  • దేశంలో చాలామంది నమ్ముతున్నది ఇదే

  • ఆప్‌ అధినేతకు సర్వోన్నత న్యాయస్థానం

  • బెయిల్‌ ఇవ్వడంపై అమిత్‌ షా వ్యాఖ్యలు

  • 2029 దాకా పీఎం మోదీనే.. ఆ తర్వాతా

  • ఆయనే మాకు నాయకత్వం వహిస్తారు!

  • 75 ఏళ్లకు మోదీ రిటైర్‌ అవుతారంటూ

  • కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపై షా ప్రతిస్పందన

న్యూఢిల్లీ, మే 15: కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇదేదో సాధారణ తీర్పు అని నేను అనుకోవట్లేదు. దేశంలో చాలా మంది.. కేజ్రీవాల్‌కు (కోర్టు) స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చినట్టు నమ్ముతున్నారు’’ అని ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. బీజేపీలో ఉన్న ఆనవాయితీ ప్రకారం.. 75 ఏళ్ల వయసు రాగానే.. అంటే 2025లో మోదీ రిటైర్‌ అవుతారంటూ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్‌ షా స్పందించారు. ‘‘నరేంద్ర మోదీ 2029 దాకా (అధికారంలో) ఉంటారు.


మీకొక దుర్వార్త ఏమిటంటే, 2029 తర్వాత కూడా మోదీ మాకు నాయకత్వం వహిస్తారు’’ అని కేజ్రీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై కేజ్రీ పీఏ బిభవ్‌ కుమార్‌ దాడి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ప్రస్తుతానికి వేరే వివాదంలో చిక్కుకున్నారు. ముందు దాన్నుంచి బయటపడనివ్వండి’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజారిటీ వస్తే జూన్‌ 5న తాను జైలు నుంచి బయటకు వస్తానని, చీపురు గుర్తుకు ప్రజలు వెల్లువలా ఓటేస్తే తాను అసలు జైలుకే వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కోర్టు ధిక్కారమేనని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల్లో ఎవరైనా గెలిస్తే.. వారు దోషులుగా తేలినా సరే, సుప్రీంకోర్టు వారిని జైలుకు పంపలేదని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. కేజ్రీకి బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తులు ఇప్పటికైనా గమనించాలి’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - May 16 , 2024 | 02:28 AM